అతడే.. విక్రమ్ రుద్రరాజు, ఐపీఎస్!
on Dec 25, 2019
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ప్రెజెంట్ చేస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'హిట్.. ద ఫస్ట్ కేస్'. 'ఫలక్‌నుమా దాస్' ఫేం విష్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ బయటికొచ్చింది. విక్రమ్ రుద్రరాజు అనే సూపరింటెన్‌డెంట్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్‌లో విష్వక్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజీ ద్వారా నాని వెల్లడించాడు. "దిస్ ఈజ్ విక్రమ్ రుద్రరాజు. హి కెన్ ఓన్లీ హ్యాండిల్ దిస్" అంటూ విష్వక్ లుక్‌ను వెల్లడిచేసే పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. జనవరి 1న ఆ క్యారెక్టర్ జర్నీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని కూడా నాని తెలిపాడు.
ఈ పోస్టర్‌లో విష్వక్ సేన్ లుక్ ఇంప్రెసివ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. డాక్టర్ శైలేశ్ కొలను డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని కాస్ట్యూం డిజైనర్, స్టైలిస్ట్ ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, ఎస్. మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్‌లో ఈ మూవీని నాని అనౌన్స్ చేశాడు. సినిమా ప్రారంభోత్సవంలో "ఒక యూనిక్ కాన్సెప్టును మీకు సగర్వంగా అందిస్తున్నాం. అలాగే ఈ సినిమాతో గొప్ప టేలెంట్‌ను పరిచయం చేస్తున్నాం" అని తెలిపాడు. 'ఫలక్‌నుమా దాస్'తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న విష్వక్ సేన్‌కు ఈ సినిమా మరింత పేరు తీసుకొస్తుందని చిత్ర బృందం చెబుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
