నానితో పాటు మైత్రి మనసు బ్రోచాడు
on Mar 7, 2020
'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన యువకుడు వివేక్ ఆత్రేయ. తొలి విజయం తర్వాత 'బ్రోచేవారెవరురా' సినిమాతో మరో విజయం అందుకున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో సెకండ్ సిండ్రోమ్, ద్వితీయ విఘ్నం సెంటిమెంట్స్ దాటేశాడు వివేక్ ఆత్రేయ. చక్కటి కథలకు వినోదాన్ని జోడించి ప్రేక్షకుల మనసు బ్రోచాడు. ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో పాటు మైత్రి మూవీ మేకర్స్ అధినేతల మనసు కూడా బ్రోచాడు. ఇటీవల వివేక్ ఆత్రేయ వినిపించిన కథకు నాని, మైత్రి నిర్మాతలు ఓకే చెప్పారట. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ తో పాటు ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే పనిలో దర్శకుడు ఉన్నాడట. నాని ఓకే చెప్పడం అయితే చెప్పాడు. కానీ, ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదు. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కావచ్చు. ప్రజెంట్ 'వి' కంప్లీట్ చేస్తున్న నాని, మరోపక్క 'టక్ జగదీశ్' షూటింగ్ చేస్తున్నారు. అది ఫినిష్ చేశాక 'శ్యామ్ సింగ రాయ్' చేస్తారు. ఆ తర్వాత మైత్రి నిర్మాణంలో వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్ చేయాలి.