పాండవులు పాండవులు తుమ్మెద ఫస్ట్ లుక్
on Dec 14, 2013
మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, తనీష్, వరుణ్ సందేశ్ లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెద". అరియానా, వివియాన సమర్పణలో మంచు విష్ణు, మనోజ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రంలో వీరు ఐదుగురు అన్నదమ్ములుగా నటిస్తున్నారని తెలిసింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. రవీనా టాండన్, హన్సిక, ప్రణీత నాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి బప్ప.బి.లహిరి, అచ్చు సంగీతాన్ని అందిస్తున్నారు.