'శ్యామ్ సింగరాయ్'గా నాని.. 2020లో మూడు సినిమాలు!
on Feb 24, 2020
నాని పుట్టినరోజు సందర్భంగా అతను హీరోగా నటించనున్న 27వ సినిమా టైటిల్‌ను నిర్మాతలు సోమవారం ప్రకటించారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న ఆ మూవీ టైటిల్.. 'శ్యామ్ సింగరాయ్'. నాని పోషించనున్న క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా పెట్టినట్లు సమాచారం. 'భీష్మ' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది. నాని ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వి' మూవీ, శివ నిర్వాణ డైరెక్షన్‌లో 'టక్ జగదీష్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వాటితో పాటు 'శ్యామ్ సింగరాయ్' కూడా 2020లోనే విడుదల కానున్నది. అంటే ఒకే ఏడాది మూడు సినిమాలతో అభిమానులను అలరించనున్నాడు నాని.
సుధీర్‌బాబుతో నాని స్క్రీన్ పంచుకుంటున్న 'వి' మూవీ మార్చి మార్చి 25న విడుదలవుతుండగా, రీతువర్మ, ఐశ్వర్యా రాజేశ్‌తో కలిసి నటిస్తున్న 'టక్ జగదీష్' సినిమా జూలై 3న వస్తోంది. ఇక 'శ్యామ్ సింగరాయ్'ని డిసెంబర్ 25న రిలీజ్ చెయ్యాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంకల్పించాడు. 'జెర్సీ' తరహాలోనే కంటెంట్ ప్రధానంగా 'శ్యామ్ సింగరాయ్' రూపొందనున్నది.
Also Read