నాని 'టక్ జగదీష్' వేషం కట్టాడు!
on Jan 30, 2020
టాలీవుడ్ మినిమం గ్యారంటీ హీరోల్లో ఒకరైన నేచురల్ స్టార్ నాని హీరోగా 'టక్ జగదీష్' సినిమా నిర్మాణ పనులు లాంఛనంగా మొదలయ్యాయి. శివ నిర్వాణ దర్శకుడు. 'నిన్నుకోరి' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషనులో తయారవుతున్న సినిమా ఇది. షైన్ స్రీన్స్ బేనర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ సినిమా.
గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో 'టక్ జగదీష్' మూవీ పనులు లాంఛనంగా మొదలయ్యాయి. ముందుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శక నిర్మాతలకు స్క్రిప్టును అందజేశారు. ఆ తర్వాత చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని కెమెరా స్విచ్చాన్ చేశారు.
నానితో ఇదివరకు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో నటించిన రీతు వర్మ, 'కౌసల్యా కృష్ణమూర్తి' ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్ కీలక పాత్రధారులు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. 'టక్ జగదీష్' రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ఔట్ డోర్ లొకేషన్లలో జరుగుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
