శర్వానంద్‌కు అలాంటి భార్య కావాలట
on Feb 3, 2020
తన జీవితంలో ఒక్క ప్రేమకథ కూడా లేదని శర్వానంద్ చెప్పాడు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తున్న సోల్‌ఫుల్ లవ్ స్టోరీ ‘జాను’లో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో. ఇంతకు ముందు అతడు చేసిన సినిమాల్లో ప్రేమకథలు ఉన్నాయి. కానీ, జీవితంలో ఎలాంటి ప్రేమకథ లేదని శర్వా చెప్పాడు. అతడిపై ఇండస్ట్రీలో రూమర్స్ కూడా లేవు. మొన్నీ మధ్య ప్రేమ గురించి ప్రశ్నించగా... ‘‘అయామ్ సింగిల్. నాట్ రెడీ టు మింగిల్. ప్రస్తుతానికి సినిమాలతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు నాకు ప్రేమ కంటే ఎక్కువగా సెలవులు కావాలి’’ అని చెప్పాడు. ‘జాను’ విడుదల కానున్న సందర్భంగా భార్యగా ఎటువంటి అమ్మాయిని కోరుకుంటున్నదీ చెప్పాడు.
‘‘నా జీవితంలో ప్రేమకథలు లేవు. ఎవరినీ ప్రేమించలేదు. కానీ, ‘మజిలీ’లో సమంత లాంటి అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఆ సినిమాలో భర్త ఏం చేసినా భార్య ఏమీ అనదు. చాలా ప్రేమగా చూసుకుంటుంది. మౌనంగా ఉంటుంది. ఎంతో ప్రేమిస్తుంది. అలా నన్ను ప్రేమించే అమ్మాయి దొరికితే సంతోషంగా పెళ్లి చేసుకుంటా’’ అని శర్వానంద్ చెప్పాడు. ‘దిల్’ రాజు కోసమే ‘జాను’ చేశానని ఈ హీరో చెప్పాడు. ‘జాను’తో పాటు ‘శ్రీకారం’లోనూ, టైటిల్ ఖరారు చేయని మరో సినిమాలోనూ శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు.
Also Read