శర్వానంద్, రీతూ వర్మ జోడీ కుదిరింది!
on Aug 28, 2019

శర్వానంద్ హీరోగా మరో సినిమా లాంఛనంగా మొదలైంది. ఇందులో అతని జోడీగా 'పెళ్లిచూపులు' ఫేం రీతూవర్మ నటిస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారం చెన్నైలో జరిగాయి. ఈ చిత్రంతో శ్రీకార్తీక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. 'పెళ్లిచూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సంబాషణలు రాస్తుండటం గమనార్హం. వెన్నెల కిశోర్, ప్రియదర్శి కామెడీ పండించే ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని నిర్మాతలు ఎస్.ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు తెలిపారు.
ఇటీవలే 'రణరంగం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్, ప్రస్తుతం తమిళ హిట్ ఫిల్మ్ '96' రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇక 'కేశవ' (2017) తర్వాత రీతూవర్మ నటిస్తోన్న తెలుగు సినిమా ఇదే. ప్రస్తుతం ఆమె తమిళంలో విక్రంతో 'ధ్రువ నచ్చతిరం' సినిమా చేస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ జోడీగా నటించిన 'కన్నుం కన్నుం కొల్లైయడిదాల్' విడుదలకు సిద్ధమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



