ఫేమస్ కొరియోగ్రాఫర్ డైరక్షన్ లో యంగ్ హీరో!!
on Jun 10, 2019
స్టైలిష్ అండ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం త్వరలో డైరక్షన్ చేయబోతున్నారన్న వార్త ప్రజంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో ఈయన `నీవల్లే నీవల్లే ` అనే సినిమాను డైరక్ట్ చేసాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఆడియో పరంగా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. కానీ, కొరియోగ్రాఫర్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈయన మరోసారి మెగాఫోన్ పట్టుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఓ కథను రెడీ చేసుకున్న ఈయన ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ స్టోరి లైన్ చెప్పాడట. పూర్తి స్క్రిప్టుతో వచ్చి మరోసారి కలవమన్నాడట శర్వా. దీంతో స్క్పిప్టు రెడీ చేసే పనిలో బిజీ గా ఉన్నాడు రాజు సుందరం మాస్టర్. అనుకున్న ప్రకారం జరిగితే వీరిద్దరి కలయికలో ఈ ఇయర్ ఎండింగ్ లో సినిమా మొదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం అందుతోంది. ఈసారైనా రాజు సుందరం మాస్టర్ సక్సెస్ కొడతాడో చూద్దాం.