నాకు పేరొస్తే.. ఆ ఘనత సమంతదే!
on Jan 29, 2020
'శతమానం భవతి' మ్యాజిక్ మళ్లీ 'జాను' సినిమాకు జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు శర్వానంద్. సమంత, అతను ప్రధాన పాత్రధారులుగా నటించిన 'జాను' మూవీ ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి సి. ప్రేంకుమార్ డైరెక్టర్. తమిళంలో హిట్టయిన '96' మూవీకి ఇది రీమేక్. బుధవారం ఈ సినిమా ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ ఈవెంట్లో శర్వానంద్ మాట్లాడుతూ.. 'జానూ మూవీలో తన పర్ఫార్మెన్సుకు పేరొచ్చిందంటే, దానికి క్రెడిట్ సమంతకే ఇస్తానని చెప్పాడు.
"దిల్ రాజు గారు ఫోన్ చేసి ఈ సినిమా చూడమన్నారు. చూశాను. 'అన్నా.. క్లాసికల్ చేద్దామా?' అని అడిగాను. 'నన్ను నమ్ము' అన్నారు. ఆయన జండిమెంటును నేను బాగా నమ్ముతా. 'శతమానంభవతి' అప్పుడు కూడా 'నన్ను నమ్ము' అన్నారు. నమ్మాను. నాకు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. ఈసారి దాన్ని కూడా దాటిస్తారు అనుకుంటాను. ఈ సినిమాలో సమంత గారు లేకపోతే నేను బాగా చేసే వాడిని కాను. ఆ మ్యాజిక్ వర్కౌట్ అయింది. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేసేవాళ్ళం. అది అన్ని సినిమాలకి కుదరదు. నేను పర్ఫామెన్స్ చేశాను.. అనే పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్ సమంతా గారికి ఇవ్వాలి. మూవీలో మ్యాజికల్ సీన్స్ చాలా ఉంటాయి. మనలో 90 శాతం మందికి టెన్త్ క్లాసు లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఆ ఫస్ట్ లవ్ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నాకు గుర్తున్నంత వరకూ తెలుగులో పదేళ్ల క్రితం వరకు ఇలాంటి లవ్ స్టోరీ రాలేదు. దిల్ రాజు గారు, సమంత, నేను ఉన్నామంటే కచ్చితంగా ఇది ఫ్యామిలీ ఫిలిం అని ఎవరికైనా అర్థమైపోతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా విషయంలో తప్పకుండా మ్యాజిక్ అయితే జరుగుతుంది. కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి అంటారు. ఈ సినిమా అలాంటిదే. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ లేకపోతే ఏ సినిమా చేసే వాళ్ళం కాదు" అని అతను చెప్పుకొచ్చాడు.