సంక్రాంతి విన్నర్... తెలుగు సినిమా ఇండస్ట్రీ!
on Feb 3, 2020
'ఎంత మంచి వాడవురా' విడుదలకు ఒక్క రోజు ముందే 'అల... వైకుంఠపురములో' సినిమా యూనిట్ నుండి సంక్రాంతి విన్నర్ పోస్టర్ వచ్చింది. అది వచ్చిన రెండోరోజుకు 'రియల్ సంక్రాంతి విన్నర్' పోస్టర్ వచ్చింది 'సరిలేరు నీకెవ్వరు' యూనిట్ నుండి! ఈ రెండు సినిమాల మధ్య విజయం విషయంలో పోస్టర్లు, కలెక్షన్ల పోటీ నడిచిన సంగతి తెలిసిందే. రెండిటిలో ఏది పెద్ద హిట్ అనేది పక్కన పెడితే... రెండు సినిమాలను నైజాం వైజాగ్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజు. సిసలైన సంక్రాంతి విన్నర్ ఆయనే అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. డిస్ట్రిబ్యూషన్ పరంగా రెండు సినిమాలపై ఆయనకు బాగానే లాభాలు వచ్చాయట.
ఇదే విషయం దిల్ రాజు అడిగితే... "సంక్రాంతి విన్నర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. నేను ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉంటున్నాను. సాధారణంగా సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదల అయితే ఒకటి సూపర్ హిట్ అవుతుంది. మరొకటి యావరేజ్ అవుతుంది. కానీ, ఈ సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. ఇంత రెవెన్యూ వస్తుందా అని మేము షాక్ అయ్యాము. ఒక సినిమా కొన్ని ఏరియాల్లో నాన్ 'బాహుబలి 2' రికార్డు సృష్టిస్తే... మరో సినిమా కొన్ని ఏరియాల్లో రికార్డులు సృష్టించింది. అటు మహేష్ బాబు కెరీర్ లో 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ కెరీర్ లో 'అల వైకుంఠపురమూలో' ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్" అని అన్నారు.