ఎక్స్‌పోజింగ్ చేయడానికి ఏముందని?
on Mar 17, 2015
కెరీర్ మాంచిజోరుమీదున్నప్పుడు కండిషన్స్ పెడతారు....ఇక బ్యాక్ టు హోమ్ అనే టైమ్ లో దేనికైనా రెఢీ అంటారు. ప్రస్తుతం బక్కపలచని భామ ఇలియానా తీరు అలానే ఉంది. టాలీవుడ్ లో దుమ్ములేపుతోంది అనుకున్న సమయంలో బీ టౌన్ పై మోజుపడి భంగపడింది. అందలం ఎక్కించిన వారిని కాదని వెళ్లడంతో వెనక్కి రాలేక....బాలీవుడ్ లో ఆఫర్స్ రాక పాపం ఉక్కిరిబిక్కిరైపోయింది. హిందీలో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అవార్డు దక్కించుకున్నా ఆ తర్వాత పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆఫర్స్ లేవుకదా అని సైలెంట్ గా ఉండిపోతే పట్టించుకునేవారెవరు చెప్పండి. అందుకే కోరికల చిట్టావిప్పి హాట్ టాపిక్ అయ్యింది ఈ దేవదాసు సుందరి. కౌబాయ్ సినిమాల్లో నటించాలనుందని, షోలే లో హేమమాలిని తరహా పాత్రలో మెప్పించాలనుందని, అవసరమైతే స్కిన్ షో కు సిద్ధమేనని తెగ ఊదరగొడుతోంది. పైగా తనకు నచ్చిన పాత్రలిస్తే పారితోషికం తగ్గించుకుంటాననే స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చింది. అయితే నా వెంట రావద్దంటే ఎత్తుకోమని మొత్తుకున్నట్టు.... నీకు ఛాన్సిచ్చేందుకే ఎవరూ ధైర్యం చేయకుంటే....అలాంటి పాత్రలు కావాలి-ఇలాంటి పాత్రలు కావాలని గొంతెక్క కోర్కెలు అవసరమా అని నవ్వుతున్నారు. సంపాందించినంతకాలం సంపాదించావ్... ఎంచక్కా బాయ్ ఫ్రెండ్ ని బెటర్ ఆఫ్ గా చేసుకుని సెటిలవ్వొచ్చుగా అని ఉచిత సలహా పడేస్తున్నారు ఇంకొందరు. మరి ఇల్లీ...నెక్ట్స్ స్టెప్ ఏంటో చూద్దాం.