అది అంతేరా బామ్మర్దీ...
on Mar 17, 2015
బావ కళ్లల్లో ఆనందం కోసం బామ్మర్ధి ఎంతకాలం కష్టపడతాడు చెప్పండి. ఇవాళ కాకపోతే రేపైనా నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలి కదా. ప్రస్తుతం ఈ పనిలోనే ఉన్నాడట మహేశ్ బాబు బావ సుధీర్ బాబు. కొన్ని సినిమాలు విజయాల బాట పట్టినా....మరికొన్ని కనీసం విడుదలైన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియడం లేదు. దీంతో 2015లో ఏదో ఒకటి చేయాలని డిసైడయ్యాడట. చిన్న హీరోలా చిన్న చిన్న సినిమాల తీసుకుంటూ పోతే లాభంలేదనుకున్నాడో ఏమో....ఏకంగా భారీ ప్రాజెక్ట్ లో నటించాలని ప్లాన్స్ వేసుకుంటున్నాడట. టెంపర్ చూపించిన పూరీని దర్శకుడిగా, టాలీవుడ్ లక్కీ గాళ్ సమంతని హీరోయిన్ గా ఎంపికచేసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. తను ఎంపిక చేసుకున్నాడు సరే...వాళ్లిద్దరూ ఒప్పుకోవాలి కదా అంటారా? అందుకే ఇక్కడ కూడా మహేశ్ సాయం తీసుకోవడం తప్పలేదట. ఏదేమైనా....సినిమా సినిమాకి బామ్మర్ది సాయం కోరేకన్నా....ఒక్కసారి బ్లాక్ బస్టర్ అందుకుంటే ఇక తిరుగుండదని ఇలా ఫిక్సయ్యాడట సుధీర్ బాబు. మరి కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనుకుంటున్న సుధీల్ కల నెరవేరుతుందా? వెయిట్ అండ్ సీ