లా అండ్ ఆర్డర్ పై వైసీపీ వాయిదా తీర్మానమా.. హవ్వ.!

Publish Date:Jul 20, 2026

Advertisement

ఏపీలో శాంతి భద్రతలపై వైసీపీ లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది. సోమవారం వైసీపీ ఇచ్చిన ఈ వాయిదా తీర్మానాన్ని పట్టించుకున్న నాథుడే లేడనుకోండి అది వేరే సంగతి.  దేశంలో  సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ  వైసీపీ ఎంపీ గురుమూర్తి.. పార్లమెంటులో శాంతి భద్రతలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. వైసీపీ వాయిదా తీర్మానంపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో అసెంబ్లీకి ముఖం చాటేసిన పార్టీ.. వాయిదా తీర్మానం ఇవ్వడమేంటంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. 

గత ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో విజయం సాధించింది. రాష్ట్రంలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ కోర్టుకు కూడా వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన అసెంబ్లీకే ముఖం చాటేశారు. ఆయనతో పాటు వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదు. అయితే నంబర్ ఉంది కనుక వైసీపీ ఎమ్మెల్సీలను మాత్రం మండలికి పంపిస్తున్నారు జగన్.  సొంత రాష్ట్రంలో అసెంబ్లీని బాయ్ కాట్ చేసి తగుదునమ్మా అని పార్లమెంటులో లా అండ్ ఆర్డర్ పై వాయిదా తీర్మానం ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది.  

ఎందుకంటే.. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతల వ్యవహారం పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉంటుంది.   ఒకవేళ శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటే బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైసీపీ ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి  ప్రభుత్వాన్ని  నిలదీయాలి.  అయితే.. ఆ పని చేయకుండా.. వైసీపీ   పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వడాన్ని ఉట్టికెగరలేనమ్మ సామెతలా ఉందని నెటిజనులు ఎగతాళి చేస్తున్నారు. 

ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఏం చేయలేక.. జాతీయ స్థాయిలో యాక్టివ్ గా ఉన్నామని చాటుకోవడానికి వైసీపీ వాయిదా తీర్మానం డ్రామా ఆడిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

AP law and order, Parliament Monsoon Session, MP Gurumoorthy, Andhra Pradesh politics

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.