అమరావతికి నో.. సీఆర్డీఏకి యస్..జగన్ వైఖరేంటి? విధానమేంటి?

Publish Date:Jul 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో  జగన్ మరోసారి మాట మార్చారు. వింత, వితండ వాదనను తెరపైకి తెచ్చారు. తాను రాజథాని అమరావతికి మాత్రమే నోఅన్నాను కానీ, సీఆర్డీయేను వ్యతిరేకించడం లేదంటూ.. రాజథాని విషయంలో తన అయోమయాన్నిగందరగోళాన్ని మరో సారి  బయటపెట్టుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇటీవల జగన్ ప్రతిపాదించిన మావిగన్ పై ప్రజా క్షేత్రంతో పాటు సొంత పార్టీలోనే  వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. నష్టనివారణకు నడుంబిగించిన జగన్.. సీఆర్డీయేకు సై అంటూ తన గందరగోళాన్ని, స్థిరత్వం లేని విధానాన్ని మరోసారి చాటుకుని నవ్వుల పాలయ్యారు.  రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ  సిఆర్‌డిఏ  పరిధిలోని అంశాన్నేజగన్ ప్రస్తావించారంటూ..  వైసీపీ ఎత్తుకున్న కొత్త భాష్యం ఇప్పుడు నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.  

అమరావతిని పక్కన పెట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ  మావిగన్ అనే కొత్త రాజధాని ప్రతిపాదనను  వైసీపీ అధినేత తరపైకి తెచ్చి వచ్చే ఎన్నికలకు అదే తన నినాదమని ప్రకటించారు. మావిగన్ సు సమర్ధించేవారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓట్లు వేస్తారనీ, జనం ఎవరివైపు ఉన్నారన్నది అప్పుడు తేలిపోతుందని సవాల్ కూడా విసిరారు.  

అయితే.. మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు. తాజాగా జగన్ సమీప బంధువు, సీనియర్ వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి మావిగన్ ప్రాంతమంతా సీఆర్డీయే పరిధిలోనే ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో జగన్ పై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. 

ఇక రాజధాని అమరాతి విషయంలో  జగన్ తీరు పూటకో మాట, రోజుకో తీరు అన్నట్లుగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014-19 మధ్య కాలంలో విపక్షంలో ఉన్న జగన్.. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీశారు. 2024 ఎన్నికలలో మూడు రాజధానులను ఏపీ ప్రజలు ప్రాంతాలకు అతీతంగా నిర్ద్వంద్వంగా తిరస్కరించి.. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతో ఘోర పరాజయాన్ని అందించారు.  ఓటమి తరువాత ఇప్పుడు అమరావతి పనులు వాయువేగంతో జరుగుతూ నిర్దుష్ట సమయానికి పూర్తి అవుతాయని అంతా భావిస్తున్న తరుణంలో.. జగన్ మళ్లీ అమరావతిపై విషం చిమ్ముతూ... మావిగన్ రాగం అందుకున్నారు.

దానికి జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని గ్రహించగానే.. సీఆర్డీయే కు జై అంటూ మావిగన్ కు కొత్త భాష్యం చెప్పడానికి తరాయరయ్యారు. తాను చెప్పిన మావిగన్ ప్రాంతం అంతా సీఆర్డీయే పరిధిలోనే ఉందంటూ వైసీపీ నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ.. నష్ట నివారణ యత్నాలు చేస్తున్నారు. నిజంగానే జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రాంత మంతా సిఆర్‌డిఏ పరిధిలోనే ఉంటే.. అది అమరావతే కదా.. కొత్త పేరుతో జనంలో గందరగోళం సృష్టించడమెందుకన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  కొత్త పేరుతో రాజధాని ప్రతిపాదనలు తెరపైకి తెచ్చి ప్రజల్లో గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి.

జగన్ ఐదేళ్ల పాలనా కాలంలో..మూడు రాజధానుల జపం తప్ప ఆ దిశగా ఒక్క ఇటుక కూడా పేర్చలేదనీ, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతి  పనులను వేగవంతం చేస్తుండటంతో  వైసీపీ డిఫెన్స్‌లో పడిందనీ, దీంతో దిక్కు తోచని పరిస్థితుల్లో పడి సీఆర్డీయేకు జై అంటూ కొత్త రాగం ఎత్తుకుని మరో సారి జనంలో గందరగోళం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వెల్లువె త్తుతున్నాయి.  

AP Capital Issue, Jagan MAVIGUN, Amaravati vs MAVIGUN,, ళP Politics,  Capital Controversy, Jagan Change Voice Again, Telugu One

By
en-us Political News

  
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.