సొంత ఎమ్మెల్యేలను పందులన్న జగన్..?

Publish Date:Dec 1, 2017

Advertisement

కాలు జారితే తీసుకోగలం.. కానీ నోరు జారితే కష్టం అంటారు మన పెద్దలు. ఏ మాట ఎక్కడ మాట్లాడినా.. అది మంచిదైనా, చెడ్డదైనా ఎన్నో చెవులకు రిజిస్టర్ అయిపోతుంది. రాజకీయ నాయకులు ఎప్పుడు.. ఎవరితో ఏం మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఆ తర్వాత వచ్చే కంపు భరించడం కాకలు తీరిన పొలిటిషియన్స్ వల్లే కాలేదు. నువ్వా నేనా అంటూ కాలు దువ్వే శత్రువు గురించైనా సరే రాజకీయాలకి వచ్చే సరికి రెస్సాక్ట్‌తో మాట్లాడాలి. లేదంటే ఆ మాట అధికారాన్ని అందివ్వగలదు.. కుర్చీలోంచి లాగి కిందకు పడేయనుగలదు. అశాంతి, అసహనం, అసంతృప్తి మనిషి మనసులో కలకలం రేపుతాయి. అలాంటి వ్యక్తికి మాట మీద అదుపు తప్పి ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడుతున్నాడో అర్థంకాదు. ఆ కోవలోకే వస్తారు వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

 

ఎంత కష్టపడ్డా కోరుకున్న లక్ష్యం దగ్గరకు రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిలో అసహనం రోజురోజుకి పెరిగిపోతుంది. గోల్డెన్ స్పూన్‌తో పుట్టడమో.. చిన్నప్పటి నుంచి కష్టపడిన నేపథ్యం లేకపోవడమో.. నడిచి నడిచి కాళ్లు నొప్పి పుడుతున్నాయో తెలియదు కానీ ఆయన సంయమనం కోల్పోతున్నారు. దీనికి తోడు నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు పార్టీ నేతలు తెలుగుదేశంలో చేరడంతో జగన్‌లో ఆవేశం కట్టలు తెంచుకొంది. నిన్నటి వరకు తనతో ఉన్నారన్న మాట కూడా మరచిపోయి వారిని నానా మాటలు అనేశారు. కాంట్రాక్టర్ల వద్ద తీసుకున్న అవినీతి డబ్బుతో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతలను గొర్రెలు, పశువుల్లా కాదు.. "పందుల్లా" కొనుగోలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

 

డబ్బు ఎరగా చూపారనో, మరేదో ఆశచూపి బుట్టలో వేసుకున్నారన్నా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ మరీ పందులతో పొల్చడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రతిపక్షం అన్నాకా అధికార పక్షంపై విమర్శలు చేయడం ఎక్కడైనా ఉంటుంది. అయితే జగన్ విషయానికి వచ్చేసరికి ఆయన హద్దులు ఏనాడో దాటేసినట్లు అనిపిస్తుంది. గతంలో ఇలా ఆవేశపడి నంద్యాలలో సీఎం చంద్రబాబును నడిరోడ్డుపైనా కాల్చేసినా ఫర్లేదని.. ఉరితీసినా తప్పులేదని కామెంట్ చేయడంతో జనం చీదరించుకున్న విషయాన్ని జగన్ మరచిపోయారా..? అంటూ సోషల్ మీడియాలో చురకలు వేస్తున్నారు నెటిజన్లు. గెలుపుపై నానాటీకి జగన్‌లో భయం పట్టుకుందని.. అందుకే నోటికి ఎంత మాటొస్తే అంత అనేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

By
en-us Political News

  
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.