దేవుడా.. తెలంగాణకి కరెంటు కష్టాలు తీర్చవా...

Publish Date:Aug 22, 2014

Advertisement

 

దేవుడా... నేను తెలంగాణ రాష్ట్ర పౌరుణ్ణి. నువ్వంటే నాకు చాలా భక్తి. నీకు ఎన్నోసార్లు పూజలు, అభిషేకాలు చేశాను, చేయించాను. యధాశక్తి నిన్ను కొలుస్తున్నాను. ఇంతకాలం నేను నిన్ను నాకోసం ఎన్నెన్నో కోరికలు కోరాను. ఇప్పుడు నేను నాకోసం కాకుండా నా తెలంగాణ రాష్ట్రం కోసం నిన్ను ఓ కోరిక కోరుతున్నాను. ఓ సమస్య నువ్వే తీర్చాలని ప్రార్థిస్తున్నాను. ఇది ఏదో చిన్నాచితకా కోరికో సమస్యో అయితే అయితే నీదాకా వచ్చేవాణ్ణి కాదు. ఇప్పుడు నువ్వు తప్ప మరెవరూ తీర్చలేనంత పెద్ద సమస్యలో మా రాష్ట్రం చిక్కుకుపోయింది. ఆ సమస్య నుంచి నువ్వే ఎలాగైనా మా తెలంగాణని కాపాడాలి.

 

మా తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి తక్కువ, వినియోగం ఎక్కువ కావడం వల్ల పరిస్థితి అంతా అయోమయంగా వుంది. మా హైదరాబాద్‌లోనే రోజుకి నాలుగైదు గంటలు కరెంట్ కట్ చేయాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఆరు నుంచి ఏడు గంటల వరకు కరెంట్ కట్ చేయాల్సి వచ్చేట్టుంది. అదే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోజుకు పన్నెండు గంటలు కరెంట్ కట్ చేస్తున్నారు. కరెంట్ లేక తెలంగాణలో పరిశ్రమల్లో కార్మికులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నారు. పవర్ లేక ప్రొడక్టివిటీ కూడా మందగించింది. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిపోయే ప్రమాదం వచ్చిపడింది. మా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో అయితే జనం కరెంట్ కోసం రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేసేంతవరకూ పరిస్థితి వెళ్ళింది.

 

మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణని కరెంట్ కష్టాల నుంచి బయటపడేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా వీలు కావట్లేదు. రాష్ట్రంలోని ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ దగ్గర కరెంట్ కొనాలంటే అక్కడా లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కరెంట్ బోలెడంత వుంది. కానీ అక్కడి నుంచి కరెంటు తెచ్చుకోవడానికి లైన్లు మాత్రం అందుబాటులో లేవు. ఛత్తీస్‌ఘఢ్ నుంచి తెలంగాణకి కొత్త లైన్లు వేసి కరెంటు తెచ్చుకోవాలనేది మా సీఎం ఐడియా. అయితే ఆ ప్రాజెక్టు ఈరోజే అర్జెంటుగా మొదలుపెట్టేస్తే పూర్తవడానికి మూడేళ్ళపైనే పడుతుందట. మరి ఎప్పుడు మొదలు పెట్టాలి.. ఎప్పుడు పూర్తవ్వాలి.. ఈలోపు మా రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు వస్తున్న కరెంట్ కూడా ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే వర్షాలు లేక జల విద్యుత్ తాడు తెగేట్టుంది. ఇలాంటి పరిస్థితుల్లో మా తెలంగాణని కరెంటు కష్టాల నువ్వే కాపాడాలి.. సరేనా దేవుడా? పలకవేంటి దేవుడా? అదేంటి.. దేవుడి విగ్రహం మాయమైపోయింది.... అంటే మా తెలంగాణ కరెంటు కష్టాలు తీర్చడం దేవుడివల్లకూడా కాదా... ఇప్పుడెలా? అయ్యో.. మళ్ళీ కరెంట్ పోయింది..

By
en-us Political News

  
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.