మెదక్: సీటు ఒక్కటే.. కర్చీఫ్‌లు బోలెడు..

Publish Date:Aug 22, 2014

Advertisement

 

కేసీఆర్ రాజీనామా చేసిన మెదక్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారు తమ తమ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అన్ని పార్టీల్లో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో పార్టీల్లో పాతకాపులుగా వున్నవారితోపాటు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యమ నాయకులు, కోటీశ్వరులు ఉండడం గమనార్హం.

 

కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ స్థానం నుంచి పోటీ చేయడానికి దాదాపు ఓ డజనుమందికి పైగా ఉవ్విళ్ళూరుతున్నారు. గత ఎన్నికలలో కేసీఆర్ చేతిలో ఓడిపోయిన శ్రవణ్ కుమార్ ఈసారి కూడా తనకు టిక్కెట్ ఇస్తే సత్తా చూపిస్తానంటున్నారు. అలాగే అందోల్ నుంచి చతికిలపడిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ కూడా మెదక్‌లో గర్జిస్తానంటున్నారు. టీ జేఏసీ కన్వీనర్ కోదండరామ్‌ని రంగంలో నిలిపితే ఎలా వుంటుందన్న ఆలోచన కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు చేస్తున్నాయి. ఇక తాజాగా మెదక్ డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన జగ్గారెడ్డి మెదక్ సీటు నా జాగీర్ అన్నట్టుగా వున్నారు. ఇక పెద్దాయన జైపాల్ రెడ్డి అయితే అధిష్ఠానం తనను పిలిచిమరీ మెదక్ టిక్కెట్ ఇస్తుందన్న భరోసాలో వున్నారు. ఇక పేర్లు రాస్తే పెద్ద చాంతాడంత లిస్టు అయ్యేంతమంది కాంగ్రెస్ పార్టీలో మెదక్ సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

 

ఇక టీఆర్ఎస్ నుంచి ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ మెదక్ సీటు మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. తనతో కలసి ఉద్యమం చేసిన స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్ ఎంచక్కా అసెంబ్లీలో సెటిలైపోయారు. తాను మాత్రం ఇంకా పదవి కోసం చకోర పక్షిలా చూస్తున్నానన్న ఆవేదనలో వున్నారు. కేసీఆర్ తనకు పిలిచిమరీ మెదక్ సీటు ఇస్తారన్న ఆశల్లో వున్నారు. అలాగే ఒక ట్రావెల్స్ అధినేత, ఒక నిర్మాణ సంస్థ అధినేత కూడా మెదక్ సీటు మీద కన్నేసి తమకున్న అర్థబలంతో ఆ సీటును సొంతం చేసుకోవచ్చని అనుకుంటున్నట్టు సమాచారం. మల్కాజిగిరిలో పోటీచేసిన మైనపల్లి హనుమంతరావు కూడా మెదక్ సీటు మీద ఆశలు పెట్టుకున్నారట. కోదండరామ్‌కి కాంగ్రెసోళ్ళు పిలిచి మెదక్ సీటు ఇచ్చేదేంటి.. మనమే ఇస్తే ఓ పని అయిపోతుంది కదా అని టీఆర్ఎస్‌లో కొంతమంది అనుకుంటున్నారట.

 

ఇప్పుడు బీజేపీ కూడా మెదక్ సీటు గురించి సీరియస్‌గా ఆలోచిస్తోంది. మొన్నటి వరకూ జగ్గారెడ్డి బీజేపీలోకి వస్తారు.. మెదక్ సీటు నుంచి పోటీ చేస్తారు అనే ఊహాగానాలు వినిపించాయి. జగ్గారెడ్డికి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని కూడా ప్రచారం జరిగిపోయింది. అయితే ప్రస్తుతం ఆ అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మెదక్ సీటు నుంచి ఎవరో అల్లాటప్పా అభ్యర్థిని నిలబెట్టడం కంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డినే నిలబెడితే తప్పకుండా తెలుస్తామన్న అభిప్రాయాలు బీజేపీలో వున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా మెదక్ స్థానాన్ని ఎలాగైనా సరే బీజేపీ సొంతం చేసుకోవాలని భావిస్తు్న్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ని తీవ్రంగా వ్యతిరేకించి పార్టీలోంచి బయటకి వచ్చేసిన రఘునందన్‌ కూడా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా బీజేపీలో చేరిన మాజీ డీజేపీ దినేష్ రెడ్డి గడచిన ఎన్నికలలో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోతారు. ఇప్పుడు ఆయన మెదక్ స్థానం మీద ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద మెదక్ పార్లమెంట్ సీటు మాత్రం ఒక్కటే వుంది.. కర్చీఫ్‌లు మాత్రం చాలానే వున్నాయి.

By
en-us Political News

  
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.