సజ్జల నన్ను కొట్టాడు.. విజయసాయి నెక్స్ట్ టార్గెట్ జగనేనా?

Publish Date:Aug 29, 2026

Advertisement

విజయసాయి రెడ్డి ఒకప్పుడు జగన్‌కు కుడిచేయిలా ఉండేవారు. అంతే కాదు వైసీపీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగారు. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు.అంతేనా ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడు.   అయితే అదంతా గతం. ఇప్పుడు ఆయన వైసీపీలో లేరు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. వ్యవసాయమే వ్యాపకమన్నారు. అయితే ఆ మాటకు కట్టుబడి ఉండలేదు. తాజాగా సొంత పార్టీ ప్రకటించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తానన్నారు. ఈ లోగానే వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత కోటరీపైనా సంచలన విమర్శలతో ఓ బహిరంగ లేఖ రాశారు. 

జగన్ అనుచర వర్గాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుని సాయి రెడ్డి రాసిన   బహిరంగ లేఖ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.   తన లేఖలో విజయసాయి.. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పనిలో పనిగా జగన్ పట్టించుకోలేదంటూ నిష్టూరమాడాడు. గతంలో కూడా పలు సందర్భాలలో వైసీపీలో జగన్ కోటరీపై విమర్శల దాడులు చేసిన విజయసాయి రెడ్డి తన తాజా బహిరంగ లేఖలో మాత్రం సజ్జల టార్గెట్ గా నేరుగానే విమర్శల దాడి చేశారు. ఆరోపణలు గుప్పించారు. ఇంత జరుగుతున్నా జగన్ మౌనంగా ఉండడాన్ని నిలదీశారు. 

అలాగే జగన్ పట్ల తాను ఎంత లాయల్ గా ఉన్నానో చెప్పుకొచ్చారు. తానెన్నడూ జగన్ కు ద్రోహం చేయలేదన్న విజయసాయి.. జగన్ కోసం తాను ఎంతో చేశానని చెప్పుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే తాను ఏ2 అని గుర్తు చేశారు. అంతే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం,   కాకినాడ పోర్ట్ కేసుల్లో కూడా తన పేరు ఉందనీ, వీటి వేటిలోనూ సజ్జల పేరు ఎందుకు లేదని ప్రశ్నలు గుప్పించారు. అక్కిడితో ఆగకుండా..  సజ్జలకు  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో, తెలుగుదేశంతో  కు రహస్య అవగాహన ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. 
అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ నాయకుడు అంటూ పేరు చెప్పకుండా  ఆరోపణలు, విమర్శలూ గుప్పించారు. ఆ నాయకుడే జగన్ మనసులో తనకు వ్యతిరేకంగా విషం నింపారనీ, ఇప్పుడా నాయకుడు నాయకుడు తెలుగుదేశం గూటికి చేరేందుకు రెడీ అయ్యారన్నారు. 

వైసీపీని వీడిన తరువాత నుంచీ సాయిరెడ్డి.వరుసగా ప్రణాళికా బద్ధంగా ఆ పార్టీపై విమర్శలు ఆరోపణలూ చేస్తున్న క్రమం గమనిస్తే.. ఆయన నెమ్మది నెమ్మదిగా జగన్ ను టార్గెట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి తన ఆరోపణలన్నీ ఒకే సారి గుప్పించలేదు. తొలుత జగన్ కోటరీ అంటూ ఎవరి పేరూ ప్రస్తావించకుండా సాఫ్ట్ గా విమర్శించారు.

ఆ తరువాత జగన్ కోటరీ ఆయనను తప్పుదోవపట్టిస్తోందనీ, జగన్ గమనించాలనీ సూచించారు. ఆ తరువాత కొందరి పేర్లు ప్రస్తావిస్తూ ఆరోపణలూ, విమర్శలూ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కర్త, కర్మ, క్రియా అన్నీ రాజ్ కేసిరెడ్డే అని తొలుత చెప్పినది విజయసాయిరెడ్డే అన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇటీవల జగన్ హయాంలోనే రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు భారీగా జరిగాయని బాంబు పేల్చారు.

ఇప్పుడు తాజాగా నేరుగా సజ్జలపై విమర్శలూ, ఆరోపణలూ గుప్పించారు. 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీలో సజ్జల తనపై భౌతిక దాడికి పాల్పడ్డారన్న విజయసాయి, అప్పుడు జగన్ ప్రేక్షక పాత్ర వహించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే.. ఇప్పటి దాకా జగన్ ను నేరుగా విమర్శించలేదు. తాజా బహిరంగ లేఖలో మాత్రం జగన్ మౌనాన్ని నిలదీశారు. ప్రశ్నించారు. తద్వారా తన ఆరోపణలపై జగన్ స్పందించాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకు వచ్చారు.

దీనిని బట్టి చూస్తుంటే.. తన కొత్త పార్టీ ప్రారంభించిన తరువాత ఇక ఆయన నేరుగా జగన్ నే టార్గెట్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక . స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి. 

{Vijayasai Reddy Next Target Jagan,Vijaya Sai Open Letter, Sajjala, Attack Ycp Internal Crisis, AP Politics, Telugu One} 

By
en-us Political News

  
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.