బొద్దింకల పార్టీ అధినేతకి ఎన్డీయే ఆఫర్.. ప్రలోభాల పర్వం మొదలైనట్లేనా?

Publish Date:Aug 18, 2026

Advertisement

కేంద్రంలోని మోడీ సర్కార్ మెడలు వంచి.. ధర్మేంద్ర ప్రధాన్  చేత రాజీనామా చేయించేలా చేసిన బొద్దింకల పార్టీ (కాక్రోచ్ జనతా పార్టీ) అధినేత అభిజిత్ దీప్కేకి ఇప్పుడు ఎన్డీయే గాలం వేస్తోంది. అంబేడ్కర్ పేరు చెప్పి.. కలిసి సాగుదాం రమ్మని ఆహ్వానం పలుకుతోందా?  అంటే తాజాగా రిపబ్లికల్ పార్టీఆఫ్ ఇండియా(ఏ) అధినేత రామదాస్ అధవాలే మాటలను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది. 

 కాక్రోచ్ జనతా పార్టీ  వ్యవస్థాపకుడైన అభిజీత్ దీప్కేకు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షమైన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) నాయకుడు, కేంద్ర మంత్రి    రామ్‌దాస్ అథావలే  బంపర్ పొలిటికల్ ఆఫర్ ఇచ్చారు. బీహార్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌పిఐ(ఎలో చేరాలని బహిరంగ ఆహ్వానం పలికారు.  అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

  ఢిల్లీలో కేంద్ర విద్యుత్ మరియు విద్యా శాఖల పరిధిలో సాగిన విద్యార్థుల భారీ ఆందోళనల్లో అభిజీత్ దీప్కే కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన పోరాటం  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు దారి తీసింది. అభిజిత్ దీప్కే , రాజకీయ పార్టీలపై,  ప్రస్తుత ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని బలంగా నమ్ముతున్నారు.బాహాటంగా చాటుతున్నారు. అటువంటి ఉద్యమ కారుడికి రామ్ దాస్ అధవాలే తమ పార్టీలోకి ఆహ్వానించడం సంచలనంగా మారింది. గత నెల 30న  అభిజీత్ దీప్కే తానను  బీజేపీలో చేరాల్సిందిగా తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. తనపైనే కాకుండా,  తన కుటుంబంపై  ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

తన తల్లిదండ్రులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయన్నారు. ఆ తర్వాత ఆగస్టు 2న, సూరత్‌కు చెందిన ఒక ఆర్‌టిఐ కార్యకర్త అభిజీత్ విదేశీ విద్యార్హతలు, ఎడ్యుకేషన్ లోన్,  ఆర్థిక మూలాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన అభిజీత్ దీప్కే.. , ఆగస్టు 3న   తన రుణ పత్రాలను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని, అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ  తన విద్యార్హతల డిగ్రీని బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు.

రాజకీయాల్లోకి రావడంపై అభిజీత్ దీప్కే స్పష్టమైన వైఖరి చాటుతున్నారు. కాక్రోచ్ జనతాపార్టీ..  ఒక రాజకీయ పార్టీగా కాకుండా, ప్రజా ఉద్యమంగానే కొనసాగుతుందని, ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీసే ప్రజా గొంతుకగా ఉంటుందని విస్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో  తన సొంత గ్రామం నుంచి "స్కూల్ థీక్ కరో" ప్రచారాన్ని ప్రారంభించి, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు,  ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై పరిమితి  వంటి సమస్యలపై పోరాడుతున్నారు. పాలక పక్షంలో చేరి ప్రజల కోసం పనిచేయాలని రామ్‌దాస్ అథావలే ఆహ్వానాన్ని ఒత్తిడుల నుంచి ఎన్డీయే ప్రలోభాలకు దిగడంగా అభివర్ణిస్తున్నారు. 

Abhijeet Dipke, CJP Founder, Ramdas Athawale, NDA Offer, RPI A, School Thik Karo Campaign

By
en-us Political News

  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.