జగన్ బొత్సను పక్కన పెట్టేసినట్లేనా?

Publish Date:Aug 26, 2026

Advertisement

వైసీపీలో నాయకుల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. వైసీపీలో ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటున్నారు. పార్టీ పరాజయం తరువాత జగన్ ఎంతో నమ్మకంగా ఉత్తరాంధ్ర పార్టీ పగ్గాలను బొత్సకు అప్పగించారు. అంతే కాకుండా ఎమ్మెల్యేగా పరాజయం పాలైనప్పటికీ బొత్సకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ప్రతిపక్ష హోదా కల్పించారు.

అయితే ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
అన్నిటికీ మించి.. బొత్స అడుగులు జనసేన వైపు పడుతున్నాయంటూ ఇటీవలి కాలంలో జోరుగా సాగుతున్న ప్రచారాన్ని బొత్స గట్టిగా ఖండించకపోవడంతో జగన్ లో  బొత్స ను ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యత నుంచి తప్పించి కొత్త వారికి అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బొత్సకు ప్రత్యామ్నాయంపై బొత్స దృష్టి పెట్టారని పార్టీ వర్గాలే అంటున్నాయి.  

ఇక బొత్స వైఖరి మారిందన్న అనుమానం జగన్ లో కలగడానికి ప్రధాన కారణం ఇటీవలి కాలంలో బొత్స పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడమేనంటున్నారు. బొత్స తన కుమారులను రాజకీయాలలోకి తీసుకురావాలని భావిస్తున్నారనీ, 2024లోనే ఆ దిశగా ప్రయత్నించినా జగన్ అందుకు అంగీకరించలేదన్న చర్చ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇక ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ తరఫున వారు రాజకీయం అరంగేట్రం చేస్తే భవిష్యత్ ఉండదన్న యోచనతో బొత్స చూపు జనసేన వైపు మళ్లిందని చెబుతున్నారు.  

దీనికి తోడు ఉత్తరాంధ్ర పై బొత్స పెత్తనాన్ని వైసీపీలోని మిగిలిన సీనియర్ నేతలు అంగీకరించడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ధర్మాన వంటి సీనియర్ నేతలను బొత్స ఇసుమంతైనా పట్టించుకోవడం లేదని అంటున్నారు. బొత్స తీరుపై   ధర్మాన ప్రసాదరావు కుమారుడైతే బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే  జగన్ కూడా బొత్స విషయంలో పునరాలోచనలో పడి బొత్సను పక్కన పెట్టే యోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Jagan keep aside Botsa Satyanarayana, YCP Uttarandhra, YCP Politics TeluguOne

By
en-us Political News

  
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.