తెలంగాణ సీఎం మార్పు?
Publish Date:Aug 22, 2026
Advertisement
తెలంగాణ అధికార కాంగ్రెస్ లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. సీనియర్ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా ఆలపిస్తున్న అసమ్మతి రాగాలూ.. సీఎం మార్పుదిశగా పడుతున్న అడుగులకు సంకేతాలంటూ రాజకీయవర్గాలలో చర్చ ఆరంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, పార్టీ సీనియర్ల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి పట్ల సొంత పార్టీలో కొందరు సీనియర్లు, మంత్రులూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వర్గం ఆయనను పదవి నుంచి తప్పించేందుకు అధిష్ఠానం వద్ద తీవ్రస్థాయిలో పావులు కదుపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాలను సీనియ నాయకుడు బాహాటంగానే బహిరంగంగానే ప్రశ్నిస్తుండడం కాంగ్రెస్ శ్రేణులలో కూడా అయోమయానికి కారణమౌతోంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి శైలిపై అసమ్మతి వ్యక్తమైనప్పటికీ, ప్రస్తుతం వ్యక్తమౌతున్నంత స్థాయిలో లేదని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం పట్ల వ్యక్తమౌతున్న అసంతృప్తి, అసమ్మతి.. అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లిందని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టిందంటున్నారు. మరో వైపుబిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తదితరులు రేవంత్ రెడ్డి సోదరులు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారంటూ చేస్తున్న ఆరోపణలు విమర్శలూ కూడా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని కర్నాటకలో మాజీ సీఎం సిద్దరామయ్యపై ఒకే సమయంలో చుట్టుముట్టిన విమర్శలు, ఆరోపణలతో తెలంగాణలో రేవంత్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలను పోలుస్తున్నారుర పరిశీలకులు. సిద్దరామయ్యకు లాగా రేవంత్ పదవికి ఈ ఆరోపణలు, విమర్శలుఇది ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయంటున్నారు. కాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వంటి అగ్రనేతలతో కూడా రేవంత్ రెడ్డికి విభేదాలు పొడసూపాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మమేష్ కుమార్ గౌడ్, భట్టిలు నిరంతరం కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదంపులు జరుపుతున్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయం తీసుకునే యోచనలో ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఏ మంత సంతృప్తిగా లేదన్న ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, హైకమాండ్ రేవంత్ పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నదనడానికి సంకేతంగా చెబుతున్నారు. ఇదే రీతిలో అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. సొంత పార్టీలోని నాయకుల అసంతృప్తి, ప్రతిపక్షాల ఆరోపణల నడుమ తెలంగాణలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో పెరిగిందనడం మాత్రం వాస్తవం. Telangana political heat, Revanth Reddy news, Telangana Politics,Telangana Congress Dissidence, KTR Allegation, Konda Comments Telangana CM Change Rumors
http://www.teluguone.com/news/content/telangana-political-heat-45-229517.html




