ప్రియుడిపై మోజు: భర్తకు ఇడ్లీలో విషం.. ఇద్దరు పిల్లలకు తీరని శోకం.!

Publish Date:Oct 27, 2026

Advertisement

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా హున్సూర్ పట్టణంలో జరిగిన ఒక అత్యంత దారుణమైన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఏకైక కారణంతో కన్న భర్త ప్రాణాలను తీయడానికి ఒక భార్య తెగించింది. నమ్మి పెళ్లాడిన భర్త తింటున్న ఇడ్లీలలో విషం కలిపి, ఆపై ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హతమార్చిన ఈ ఉదంతం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హున్సూర్‌కు చెందిన 30 ఏళ్ల పవిత్ర  35 ఏళ్ల రామ ప్రసాద్ భార్యాభర్తలు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. సంతోషంగా సాగిపోవాల్సిన ఆ కుటుంబంలోకి అనుమానాస్పద పరిచయాలు రావడంతో పెను విషాదం అలుముకుంది.

కొంతకాలంగా పవిత్రకు సునీల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ తరచూ కలుసుకుంటూ తమ బంధాన్ని కొనసాగించారు. అయితే, వీరిద్దరి రాకపోకలకు భర్త రామ ప్రసాద్ అడ్డుగా మారుతున్నాడని పవిత్ర భావించింది. భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని పక్కా ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 16వ తేదీన పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన రామ ప్రసాద్ ఆకలితో భోజనం కోరగా, పవిత్ర అతనికి ఇడ్లీలు వడ్డించింది. అయితే ఆ ఇడ్లీలలో, చట్నీలో ప్రాణాంతకమైన ఉమ్మెత గింజల పొడిని అత్యంత మోసపూరితంగా కలిపింది.

భర్త రామ ప్రసాద్ ఆ విషపూరితమైన ఇడ్లీలను తిన్నప్పటికీ, ఆమె ఆశించిన స్థాయిలో తక్షణ ఫలితం రాలేదు. దీంతో కంగారుపడిన పవిత్ర తన ప్రియుడు సునీల్‌ను నేరుగా ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడితో కలిసి ఇద్దరూ కలిసి తీవ్ర నిస్సత్తువులో ఉన్న రామ ప్రసాద్ గొంతును నులిమి అతి క్రూరంగా హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హున్సూర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పోస్టుమార్టం నివేదికల ఆధారంగా ఇది ముమ్మాటికీ హత్యేనని తేల్చారు. నిందితులైన భార్య పవిత్రను, ఆమె ప్రియుడు సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కన్న పిల్లల భవిష్యత్తును విస్మరించి, క్షణికావేశానికి, వివాహేతర సంబంధానికి బలై రెండు నిండు ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతం చూసిన ప్రతీ ఒక్కరూ చలించిపోతున్నారు.

 

 

 

[ wife poisons husband, karnataka crime news, hunsur murder case, illicit relationship murder, mysuru news, wife kills husband idli, Telugu News, Telugu One, karnataka crime news Pavitra, Rama Prasad, Sunil ]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.