తమిళనాడులో భారీ జైలు బ్రేక్‌.. 17 మంది ఖైదీలు పరార్‌.!

Publish Date:Oct 27, 2026

Advertisement

తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా ఆండిపట్టి సమీపంలో ఉన్న తెక్కంపట్టి సబ్‌జైలు నుంచి 17 మంది రిమాండ్ ఖైదీలు పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది. సోమవారం (అక్టోబర్ 26) అర్ధరాత్రి సమయంలో ఖైదీలు జైలు సిబ్బందిపై దాడి చేసి తప్పించుకున్నారు. ఈ ఘటనలో జైలు సిబ్బందికి గాయాలు కావడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం. జైలులోని ఒకే గదిలో ఉన్న 17 మంది ఖైదీలు పక్కా ప్రణాళికతో తప్పించుకున్నారు. 

రాత్రి సమయంలో తమలో ఒక ఖైదీకి మూర్ఛ లేదా ఫిట్స్ వచ్చినట్లు మిగతా ఖైదీలు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అతడికి వైద్య సహాయం అందించేందుకు జైలు సిబ్బంది గది తలుపులు తెరిచారు. ఇదే అదనుగా భావించిన ఖైదీలు ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జైలు ప్రధాన ద్వారం నుంచి బయటకు పారిపోయారు. ఈ దాడిలో తంగపాండి అనే సిబ్బందికి తలపై తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు జైలు సిబ్బందికి కూడా గాయాలైయ్యాయి.


నలుగురు మళ్లీ అరెస్ట్‌.. 13 మంది కోసం గాలింపు.!

17 మంది ఖైదీలు పరారైన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. జైలు పరిసర ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తాజా మీడియా నివేదికల ప్రకారం.. పరారైన వారిలో నలుగురిని పోలీసులు తిరిగి పట్టుకున్నారు. మిగిలిన 13 మంది కోసం గాలింపు కొనసాగుతోంది.ఖైదీలను పట్టుకునేందుకు దక్షిణ మండల పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. తేని, మదురై, దిండిగల్ జిల్లాలతో పాటు కేరళ సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘా పెంచారు. ప్రధాన రహదారులు, చెక్‌పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పరిసరాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు.

జైలు భద్రతపై ప్రశ్నలు.!

ఒకేసారి 17 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవడం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. ఖైదీలు ఒకే గదిలో ఉండటం, వైద్య అత్యవసర పరిస్థితి ఉందన్న సమాచారంతో సిబ్బంది గది తలుపులు తెరిచిన సమయంలో దాడి జరగడం వంటి అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు.జైలు నుంచి ఖైదీలు ఎలా తప్పించు కున్నారు? భద్రతా విధుల్లో నిర్లక్ష్యం జరిగిందా? ఈ ఘటన వెనుక మరెవరైనా సహకారం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

 

 

 

[ Tamil Nadu Jailbreak, Theni Jailbreak, Thekkampatti Sub Jail, 17 Prisoners Escape, Tamil Nadu Prisoners Escape, Theni Police, Prison Security Breach, Prison Staff Attack, 4 Prisoners Recaptured, 13 Prisoners Missing, Tamil Nadu Police Search Operation, Special Police Teams, Prison Break News, Dindigul Police ]


 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.