ఎయిమ్స్ మంగళగిరికి జలయోగం!

Publish Date:Jul 8, 2024

Advertisement

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... షార్ట్.కట్‌లో ఎయిమ్స్. పేదలకు ఉత్తమ వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో ఏర్పాటు చేసిన వైద్య సంస్థ. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్.ని 1680 కోట్ల రూపాయలతో నిర్మించింది. ఆ ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీ కూడా వుంది. మంగళగిరి ప్రాంతంతోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తూ వుంది ఎయిమ్స్. ఇక్కడ నిపుణులైన వైద్యులు, సిబ్బంది వున్నారు. ఇది పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ సంస్థ. నిర్మాణం, నిర్వహణ బాధ్యత కేంద్రానిదే. 2016లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిమ్స్.కి 2019 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిమ్స్.కి నీటి సరఫరా ఆపేశారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించింది కదా.. అందుకని! నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదువుతున్నాయి మహాప్రభో అని ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఎయిమ్స్.కి నీళ్ళు ఇవ్వడం పెద్ద కష్టమైన పని కూడా కాదు. నాలుగైదు కిలోమీటర్ల దగ్గర్లోనే కృష్ణానది కూడా వుంది. అయితే నీరు ఇచ్చే ఉద్దేశమే లేనప్పుడు నది పక్కనే వున్నా నీళ్ళు ఇవ్వరు కదా.. దాంతో చేసేది లేక ఎయిమ్స్ ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తూ నెట్టుకొస్తోంది. అయితే 900 పడకల స్థాయి వున్న ఆ ఆస్పత్రిని నీటి ఎద్దడి కారణంగా 350 పడకల ఆస్పత్రిగా కుదించి సేవలు అందిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడిగా కూడా వున్నారు. ఆయన కూడా నీటి సమస్య గురించి ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఎవరు ఎలాగైనా చావండి.. ఇది చంద్రబాబు హయాంలో కట్టింది కాబట్టి మేం పట్టించుకోం... ఇలా సాగింది జగన్ ప్రభుత్వ వైఖరి. 

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస ప్రభుత్వం తొలగిపోయి, పనిచేసే ప్రభుత్వం రావడంతో ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్‌లో కొత్త ఆశలు చిగురించాయి. ఆరు రోజుల క్రితం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఎయిమ్స్ ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్యని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆరు రోజులు అలా గడిచాయో లేదో.. ఎయిమ్స్.కి కృష్ణానది నుంచి నీటిని సరఫరా చేసే పైపు లైన్ల ఏర్పాటు పనులు ప్రారంభమై, చకచకా జరుగుతున్నాయి. పనికిమాలిన ప్రభుత్వానికి, పనిచేసే ప్రభుత్వానికి మధ్య తేడా ఇదే.

By
en-us Political News

  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.