కాషాయ పార్టీకి వార్నింగ్ బెల్స్.!

Publish Date:Aug 4, 2026

Advertisement

బీజేపీకి వార్నింగ్ బెల్స్ మోగాయి. సోమవారం (ఆగస్టు 3) వెలువడిన మూడు ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ మూడు ఉప ఎన్నికలలో రెండింటిలో బీజేపీ పరాజయం పాలైంది. మరీ ముఖ్యంగా బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలలో ఆ పార్టీ చతికిల పడటంతో మోడీ, షా మ్యాజిక్  పని చేయడం లేదా  అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన   8 నెలలకే, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన సీటును నిలబెట్టుకోవడంలో కమలం పార్టీ విఫలమైంది.   ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు తలొగ్గి మెట్టు దిగిన రోజుల వ్యవధిలో.. కమలం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గాలు బద్దలు కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనమని అంటున్నారు. 

నీట్ పేపర్ లీక్ కు జవాబుదారీతనం కోరుతూ జరిగిన విస్తృత నిరసనలు, రామ మందిర నిధుల దుర్వినియోగం, , ఈ20 ఇంధనంపై పెరుగుతున్న ఆగ్రహం వంటి సమస్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ సమస్యలకు తోడు, అవినీతి కారణంగా పార్టీలోని కొందరు నాయకులు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటుండటంతో పార్టీలో గందరగోళం  నెలకొంది.

ఈ ఉప ఎన్నికలలో ఓటమికి పార్టీ దృక్కోణం నుండి వివిధ రాజకీయ కారణాలను చెప్పుకోవచ్చు కానీ..  పార్టీలకు అతీతంగా.. వివిధ వర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న పలు సున్నితమైన సమస్యలను పట్టించుకోని ఫలితమే ఈ ఫలితాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కచ్చితంగా కమలం పార్టీకి డేంజర్ బెల్స్ గానే పరిగణించాల్సి ఉంటుంది.  

Warning bells to BJP, By Poll, Results, Defeat, Two Seats, Bihar, Madhya Pradesh

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.