పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పొలిటీషియన్ గా నిలదొక్కుకునేనా?

Publish Date:Aug 5, 2026

Advertisement

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. దేశ రాజకీయాలలో గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ సొంత రాష్ట్రంలో  సొంత పార్టీ పెట్టి బొక్కబోర్లా పడ్డారు. జన సురాజ్ పార్టీని స్థాపించి.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టారు. కానీ ఒక్క స్థానంలో కూడా జనసురాజ్ అభ్యర్థి విజయం సాధింలేదు సరికదా, కనీసం డిపాజిట్ కూడా దక్కనంత ఘోరంగా ఆ పార్టీ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. దీంతో తొలి అడుగులోనే ప్రశాంత్ కిశోర్ జనసూరజ్ పార్టీకి నూకలు చెల్లిపోయాయన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ప్రశాంత్ కిశోర్ మళ్లీ ఎన్నికల వ్యూహకర్తగా  కెరీర్ ను కొనసాగించక తప్పదన్న విశ్లేషణలు జోరందుకున్నాయి. 

అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  

ఈ విజయం నిస్సందేహంగా ప్రత్యేకమైనది ఎందుకంటే.. ప్రశాంత్ కిశోర్ పోటీ చేసి గెలిచిన బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి పెట్టని కోట లాంటిది.  అదీకాక.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో..  ఖాళీ అయిన ఈ స్థానం నుంచి  ప్రశాంత్ కిషోర్ విజయాన్ని పరిశీలకులు   బీహార్ రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాందిగా అభివర్ణిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు.  

ఎందుకంటే.. సాధారణంగా ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి విజయం నల్లేరు మీద బండి నడక. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థికి జనం ఓటు వేస్తారు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో అందుకు భిన్నంగా.. బీజేపీ, ఆర్జేడీలను జనం ఏకకాలంలో తిరస్కరించి.. ప్రశాంత్ కిశోర్ కు జై కొట్టారు.   ఈ తీర్పు  కేవలం ప్రధాన పార్టీలను తిరస్కరించడంగానే కాకుండా..  తమ సమస్యల కోసం నిలబడతారన్న నమ్మకాన్ని ప్రశాంత్ కిశోర్ పై జనం ఉంచారనడానికి తార్కానంగా చూడాలంటున్నారు పరిశీలకులు.  

ఈ కారణంగానే బంకీపూర్ లో ప్రశాంత్ కిశోర్ సాధించిన విజయం ప్రత్యేకమైనది.  శాసనసభలో తన జన సురాజ్ పార్టీ తరఫున ఏకైక ప్రతినిధిగా అడుగుపెడుతున్న ప్రశాంత్ కిశోర్ సభలో తన గళం ఎలా వినిపిస్తారు? అన్న దానిపైనే  రాష్ట్రంలో జనసురాజ్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది.  రానున్న నాలుగేళ్లూ.. పీకేకీ, జనసురాజ్ పార్టీకి అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు.  అసెంబ్లీలో ప్రజల గొంతుక వినిపించడమే కాకుండా.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి   ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ పైనే ఆయన రాజకీయ భవిష్యత్, జనసురాజ్ భవిష్యత్ ఆధారపడి ఉంది.  

rashant Kishor victory, Jan Suraaj party Bihar, Bankipur assembly by-election, Prashant Kishor MLA win, Bihar political updates, Prashant Kishor strategy

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.