విదురుడు చెప్పిన ఈ విషయాలు పాటిస్తే తలపెట్టిన కార్యాలలో విజయం తథ్యం..!
Publish Date:Dec 8, 2024
Advertisement
విదురుడు ధృతరాష్ట్రునికి తమ్ముడు. ఈయన దాసికి జన్మించిన వాడు కావడంతో రాజు కాలేకపోయాడు. అయితేనేం ధృతరాష్ట్రుని వద్ద మంత్రిగా ఉండేవాడు. విదురుడు న్యాయశాస్త్రాలు అవపోశన పట్టాడు. నీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. మహారాజు ధృతరాష్ట్రుడికి, విదురుడికి మహా భారత యుద్దం ముందు కొన్ని చర్చలు సాగాయి.అందులో భాగంగా విదురుడు చెప్పిన కొన్ని నీతి వాక్యాలు, విషయాలు విదుర నీతి పేరుతో ప్రసిద్ధి కాంచాయి. చాణక్య నీతి లాగా విదుర నీతిని పాటించిన వారు జీవితంలో ఉత్తములుగా ఉంటారట. విదురుడు చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తే విజేతలు కావడం తథ్యం అంటున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. జ్ఞానం.. నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయం చాలామందికి తెలియదు. తన సామర్థ్యం ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకుని తన జ్ఞానాన్ని గుర్తించి దాన్ని సరైన సమయంలో సరైన స్థలంలో ఉపయోగించుకునే వాడే నిజమైన జ్ఞాని అని విదురుడు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి తను ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని చేరుకుని కచ్చితంగా విజేత అవుతాడట. మూర్ఖుడు.. నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తితో పాటు మూర్ఖులు కూడా ఉంటారు. అసలు మూర్ఖుడు అనే విషయాన్ని నిజమైన మూర్ఖుడు కూడా ఒప్పుకోడు. ప్రతి ఒక్కరూ తాము చాలా జ్ఞానవంతులం అనే అంటారు. కానీ విదురుడు చెప్పాడు నిజమైన మూర్ఖుడు అంటే ఎవరో.. పిలవకుండానే లోపలికి వచ్చేవాడు.. అడగకుండానే మాట్లాడేవాడు మూర్ఖుడు అని విదురుడు అన్నాడు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలట. పనులు.. ఏ పనులు చెయ్యాలి.. ఏ పనులు చెయ్యకూడదు అనే విషయంలో కొంత స్పష్టత ఉండటం అవసరం. వ్యక్తి చేసే పనే ఆ వ్యక్తిని ఉత్తముడిగా నిలబెడుతుంది. మనసుకు, శరీరానికి బాధ కలిగించే డబ్బు సంపాదన, లేదా మతాన్ని ఉల్లంఘించే పని చేయడం ఎప్పుడూ తప్పు పని కిందే లెక్క వస్తుందట. అంతే కాదు.. ఏదైనా బెనిఫిట్ కలుగుతుంది అంటే శుత్రువు ముందు అయినా సరే.. తల వంచే పనులు ఎప్పటికీ చేయకూడదు అని విదురుడు చెప్పాడు. తెలివి.. తెలివైన వ్యక్తులు ఎవరు అంటే అందరూ మేమంటే మేము అని అనుకుంటారు. కానీ తెలివైన వ్యక్తులు అంటే జ్ఞానం కలిగిన వారు.. ఇలాంటి వ్యక్తులు ఏ పనిని అయినా, ఏ విషయాన్ని అయినా తొందరగా అర్థం చేసుకుంటారు. అవతలి వ్యక్తి మాటలను ఎంతో శ్రద్దతో, ఓర్పుతో వెంటాడు. ఏ ఉద్దేశ్యం లేకుండా మాట్లాడని వారు తెలివైన వారు. ముఖ్యంగా తమ సమయాన్ని వృధా చేసే విషయాల పట్ల దూరంగా ఉండేవాడు నిజమైన తెలివిగల వాడు అని విదురుడు చెప్పాడు. ప్రతి వ్యక్తి ఈ పనులన్నీ అలవాటు చేసుకుని పైన చెప్పుకున్నట్టు ఉంటే.. ఆ వ్యక్తులు జీవితంలో తలపెట్టిన ఏ పనిలో అయినా విజయం సాధించడం ఖాయం అంట. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/vidura-successful-tips-35-189608.html