అవినీతి ముల్లులు చేసే అన్యాయానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత యువతదే..!
Publish Date:Dec 9, 2024
Advertisement
బాధ్యతగా చేయమని అప్పగించిన అధికారాన్ని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్నే అవినీతి అంటారు. ‘అవినీతి తిమింగలాలు’ అనే మాట చాలా సార్లు పేపర్లలో రావటం చదువుతూనే ఉంటాము. మన సమాజంలో చాప కింద నీరులా అల్లుకుపోయిన అవినీతిని నిర్మూలించటానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని అరికట్టటం వీలు పడట్లేదు. ఎందుకంటే ఈ అవినీతి అనేది వ్యవస్థలో కింది నుంచి పై స్థాయివరకూ ఉంది. ఒక సాధారణ క్రింది స్థాయి ఉద్యోగి మొదలుకుని ఉన్నత స్థాయి ఉద్యోగులు, నాయకులు, సంస్థల వరకూ చాలా మటుకు ఈ అవినీతిలో భాగమైపోతున్నారు. "దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు" అన్న చందాన తయారయింది నేటి సమాజం. ఇది ఎంత స్థాయివరకూ ఉందంటే, ఏదైనా వ్యవస్థలో మన పని జరగటానికి, అవినీతిలో మనమూ భాగమైతేనే సాధ్యమవుతుందనే ఆలోచనా విధానానికి ప్రజలు వచ్చేశారు. అంతలా అవినీతి వ్యవస్థలోకి చొరబడిపోయి ఇది సర్వసాధారణమే అన్నట్టు మారిపోయింది. అవినీతి జరగటం వల్ల అర్హులైనవాళ్లు అన్నీ కోల్పోతారు, అనర్హులైనవాళ్లు అవినీతి సాయంతో అందలమెక్కుతారు. ఇలా అవినీతి ఎంతోమంది జీవితాలని ఛిన్నాభిన్నం చేసింది, చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న అవినీతిని అరికట్టాలనే ఉద్దేశ్యంతో అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 9వ తేదీన జరుపుకుంటున్నారు. దీని గురించి మరికాస్త విస్తృతంగా తెలుసుకుంటే.. అవినీతి వల్ల కలిగే దుష్ప్రభావాలు.. ప్రజలకి వ్యవస్థలపై నమ్మకం తగ్గిపోతుంది. న్యాయపాలనను దెబ్బతీసి, పౌరుల స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారుతుంది. సమాజంలో అసమానతలను పెంచుతుంది. ప్రజాస్వామ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. మానవ హక్కుల రక్షణలో ఆటంకం ఏర్పడుతుంది, పేదలకు అవసరమైన సేవలు అందకుండా పోతాయి. ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు తగ్గి, జీవనంలో నాణ్యత తగ్గిపోతుంది. 2024.. థీమ్.. 2024వ సంవత్సరానికిగానూ "అవినీతి వ్యతిరేక పోరాటంలో యువతతో ఐక్యం కావటం, రేపటి నైతికతను నిర్మించడం".అనే థీమ్ లక్ష్యంగా ఉంది. అవినీతి వల్ల జరిగే చెడు ప్రభావాల గురించి యువతకు అవగాహన కల్పించి, వారిని అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తారు. యువతను నిర్ణయాలు తీసుకునే అధికారులతో చర్చలు జరిపేలా ప్రోత్సహిస్తారు. యువత భాగస్వామ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జరిగే అవినీతిని నిర్మూలించే లక్ష్యంగా పనిచేస్తారు. భారతదేశంలో అవినీతి వ్యతిరేక చర్యలు: భారతదేశంలో అవినీతి నియంత్రణ కోసం వివిధ చట్టాలు, సంస్థలు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు లోక్‌పాల్, సివిసి, సీబీఐ వంటి సంస్థలు అవినీతికి పాల్పడినవారికి తగిన శిక్ష పడేలా చేస్తాయి. అవినీతి వ్యతిరేక ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతమున్న అవినీతి వ్యతిరేక చట్టాలు, విధానాలు: అవినీతి నిరోధక చట్టం, 1988: అవినీతి నిర్వచనాలు, దోషులకు శిక్షలు ఇందులో ఉంటాయి. భారతీయ న్యాయ సంహిత, 2023: అవినీతి, లంచాలపై నూతన నిబంధనలు ఉన్న చట్టమిది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013: అవినీతి నిర్మూలనపై ప్రజా బాధ్యతను పెంచటానికి చేసిన చట్టం. విశిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ చట్టం, 2014: అవినీతి విషయాలను బట్టబయలు చేసిన వారిని రక్షించే చట్టం. ఇతర చట్టాలు: మనీలాండరింగ్ నిరోధక చట్టం,2002, బెనామీ లావాదేవీలు చట్టం,1988, బ్లాక్ మనీ, పన్ను విధానం చట్టం,2015. * కేంద్ర విజిలెన్స్ కమిషన్: ప్రభుత్వ విభాగాల్లో అవినీతి నివారణ, పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. అవినీతి అవగాహన సూచిక: అవినీతి నిర్మూలన కోసం ఏం చేయాలి? యువత ప్రోత్సాహం: అవినీతి రహిత భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్రను గుర్తించాలి. గ్లోబల్ ఐక్యత: అంతర్జాతీయంగా దేశాల మధ్య అవినీతి నిర్మూలనలో సహకారాన్ని పెంపొందించాలి. చట్టపరమైన సంస్కరణలు: అవినీతి అవగాహనా సూచికలో వెనుకబడిన దేశాలన్నీ మరింత కఠినమైన చట్టాలను ఆమోదించేలా కృషి చేయాలి. పాలనా వ్యవస్థ మెరుగుదల: ప్రభుత్వ ఆచరణాత్మకతను పెంపొందించాలి. ప్రజలకి వ్యవస్థలపై నమ్మకం కలగాలన్నా, శాంతి, భద్రతలకి ఆటంకం కలగకుండా, సమాజ అభివృద్ధి లక్ష్యాలు నెరవేరాలన్నా, అవినీతి రహిత సమాజం కోసం అందరం కలసికట్టుగా పని చేయాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రతీ పౌరుడు తన అవసరం కోసమో, స్వార్ధ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అవినీతికి పాల్పడకుండా ఉంటూ, అలా పాల్పడేవారిని నివారించటం చేస్తే మనం కలలు కంటున్న అవినీతి రహిత సమాజాన్ని తొందరలోనే చూడగలమని ఆశిద్దాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత ఆశ చూపించినా నైతికతని కోల్పోకుండా, అధికార దుర్వినియోగం చేయకుండా, తమ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం తన శక్తికి మించి శ్రమిస్తున్న ప్రతీ వ్యక్తిని ఈ సమాజం గౌరవించి, ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే అవినీతిని అంతం చేయడం సాధ్యమవుతుంది. *రూపశ్రీ.
అవినీతికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన సందర్భాలు అరకొర ఉన్నప్పటికీ, అవి సమాజం నుంచి అవినీతిని దూరం చేయలేకపోతున్నాయి. వేళ్లూనుకుపోయిన అవినీతిని మూలాల నుంచి పెకిలిస్తే తప్ప దాన్ని నాశనం చేయలేము. అవినీతి అనేది సాధారణంగా తీసుకోవాల్సిన విషయం కాదని, దాని వల్ల సమాజానికి ఎంత నష్టమో, నైతికత, న్యాయం ద్వారా చట్టబద్దంగా అవినీతిపై పోరాడటం ఎలాగానే విషయాన్ని ప్రజలకి అర్ధమయ్యేలా చెప్పాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అవినీతి గురించి అవగాహన పెంచడం, నిజాయితీ, బాధ్యత అనే నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించి, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ రిజల్యూషన్ 58/4 ద్వారా, 2003వ సంవత్సరం నుంచి డిసెంబర్ 9వ తేదీని ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా’ ప్రకటించింది. ఈ దినోత్సవం, అవినీతి సమస్యలపై అవగాహన పెంచడంలో, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.
చట్టాలు అమలు చేసే సంస్థలు:
* సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్: అవినీతి సంబంధించిన ప్రధాన కేసులు విచారణ చేస్తాయి.
* స్టేట్ ఏంటీ కరప్షన్ బ్యూరోలు: రాష్ట్ర స్థాయి కేసుల పరిశీలన చేస్తాయి.
‘ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ సంస్థ, ప్రతి సంవత్సరం అవినీతి అవగాహన సూచికను ప్రచురిస్తుంది. ఇందులో ఒక సూచీ ప్రకారం ఒక దేశానికి సున్నా నుండి వంద వరకు కొన్ని పాయింట్లను ఇస్తారు. వాటి ఆధారంగా ఒక దేశ స్థానం నిర్ణయిస్తారు. [సున్న(అతి ఎక్కువ అవినీతి), వంద(అతి తక్కువ అవినీతి)] 2023లో భారతదేశానికి మొత్తం 180 దేశాలలో 93వ స్థానం లభించింది. మన దేశానికి దక్కిన ఈ స్థానం, మన దేశంలో అవినీతి నిర్మూలనకి మరింత బలమైన చట్టాలు, విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది.
http://www.teluguone.com/news/content/-international-anti-corruption-day-35-189612.html