డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలకు ఇలా చెక్ పెట్టవచ్చు..!
Publish Date:Dec 17, 2024
Advertisement
డబ్బు అనేది మనుషుల మధ్య ఎంత విభేదాలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.. ఇద్దరు వ్యక్తులు ఒక బంధంగా ఏర్పడిన తరువాత ఆ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. బయటి వ్యక్తుల కోసమో.. డబ్బు కోసమో.. భాగస్వామిని తక్కువ చేయడం డబ్బే ఎక్కువ అనుకోవడం చేయకూడదు. దీని వల్ల డబ్బు కోసమే బంధం కలుపుకున్నారని అనుకుంటారు. అందుకే డబ్బును అవసరమైన వస్తువుగా చూడాలి. భార్యాభర్తులు ఇద్దరూ సంపాదించేవారు అయినా, కేవలం భర్త మాత్రమే సంపాదిస్తున్నా ఇద్దరూ కలిసి ఆర్థిక విషయాలు చర్చించుకోవడం ముఖ్యం. భార్యలకు ఆర్థిక విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అనుకునే మగవాళ్లు ఆర్థికంగా ఎదగడం లేదనే విషయాన్ని సాక్షాత్తూ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆర్థికంగా బలపడాలి, ఎదగాలి అనే ఇప్పటి తరం అమ్మాయిలు అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఆర్థిక విషయాలలో అమ్మాయిలే ఒక అడుగు ముందుంటారు. భార్యకు చెప్పకుండా ఏ ఆర్థిక కార్యకలాపం చేయకూడదు. అలాగే భర్తకు చెప్పకుండా భార్య కూడా ఆర్థిక విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక నిర్ణయాలు ఉమ్మడిగా ఉండాలి. సంపాదన.. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్న జంటలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇద్దరికీ కలిపి ఎంత శాలరీ వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం ముఖ్యం. అంతేకాదు.. ఒకవేళ భార్యకు ఉద్యోగం లేకపోయినా సరే... భార్త భార్యకు తన సంపాదన గురించి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సంపాదన గురించి స్పష్టంగా చెప్పినప్పుడే ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. బడ్జెట్.. బడ్జెట్ ప్లానింగ్ అనేది ప్రతి కుటుంబానికి చాలా అవసరం. దీని వల్ల ఆర్థిక విషయాలు ఎలాంటి గోల లేకుండా సాఫీగా సాగుతాయి. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనాపరులైతే.. ఇద్దరి శాలరీ నుండి ఇంటి బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల ఇద్దరికీ ఇంటికోసం ఎంత ఖర్చు చేస్తున్నాం అనే అవగాహన వస్తుంది. బడ్జెట్ ప్లాన్ చేసుకున్న తరువాత ఇద్దరూ కలిసి సేవింగ్స్ పైన దృష్టి పెట్టాలి. ఇద్దరూ కలసి చేసుకునే సేవింగ్స్ లో ఎవరు ఎవరినీ నొప్పించేలా ఉండకూడదు. ఏ విధమైన సేవింగ్స్ చేస్తే ఇద్దరి భవిష్యత్తుకు మంచిదని చూడాలి తప్ప నా పేరుతో సేవ్ చేయాలి అంటే నా పేరుతోనే అనే వాదనలు వద్దు. ఒకవేళ డబ్బంతా అకౌంట్ లో పెట్టాలి అనుకుంటే ఇద్దరూ కలిసి ఒక జాయింట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఇద్దరికీ సంబంధించి కనీసం ఆరు నెలల నుండి ఏడాది జీవనం గడిచేలా డబ్బును ఆర్థిక భద్రతగా ఉంచుకోవాలి. ఏదైనా పరిస్థితి ఎదురై ఇద్దరూ చాలా కాలం పాటు ఉద్యోగం చేయలేకపోయినా ఈ డబ్బే భరోసా ఇస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే వారిద్దరి శాలరీలో ఇద్దరూ తమకంటూ సెల్ఫ్ గా కొద్దిగా ఫండ్ ను క్రియేట్ చేసుకోవాలి. దీని గురించి ఎవరూ ఎదుటివారిని ప్రశ్నించకూడదు. ఏనైనా ఇష్టాలు, కొనాలనుకునే ప్లానింగ్స్ ఉంటే అవి కూడా ఈ సెల్ఫ్ మనీలో భాగం చేసుకోవాలి. ఇలా చేస్తే బడ్జెట్ మీద భారం ఉండదు. భవిష్యత్తు.. వాస్తవ జీవితంలో సంతోషంగా ఉన్నామా లేదా అని ఆలోచించేవారే ఎక్కువ. కానీ భవిష్యత్తు ప్లానింగ్స్ కూడా ఫర్పెక్ట్ గా ఉండాలి. ఇలా చేస్తే రేపటి రోజున కూడా ఎలాంటి సమస్య లేకుండా హాయిగా ఉండగలుగుతారు. ఆర్థిక విషయాలలో ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉండి.. దాన్ని భాగస్వామికి అర్థమయ్యేలా వివరించగలిగితే చాలా వరకు డబ్బు కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావు. *రూపశ్రీ.
డబ్బు.. ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. సిల్లీ విషయం ఏంటంటే.. ఈ డబ్బును మనిషే కనిపెట్టాడు. డబ్బు సంపాదించేది కూడా మనిషే.. కానీ మనిషి చేతిలోకి రాగానే ఆ డబ్బు మనిషిని కిందా పైనా చేస్తుంది. ఈ డబ్బు కేవలం బయటి వాళ్ల మధ్యనే కాదు.. ఒకే ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తుంది. ఆఖరికి జీవితాంతం కలిసి బ్రతకాలని ఒక్కటిగా మారిన భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చేలా చేస్తుంది. కానీ ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని చిట్కాలు పాటించడం వల్ల డబ్బు కారణంగా ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. భార్యాభర్తల జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది కూడా.
మీకోసం డబ్బు కావాలి.. డబ్బు కోసం మీరు కాదు..
మాట్లాడుకోవాలి..
సేవింగ్స్..
సెల్ఫ్ గా..
http://www.teluguone.com/news/content/fights-between-husband-and-wife-35-189955.html