మీ పని మనిషి మీద మీకు నమ్మకం ఎక్కువా? పొరపాటున కూడా ఈ విషయాలు ఆమె ముందు చర్చించకండి!
Publish Date:Dec 14, 2024
Advertisement
లాకర్.. ఇంట్లో లాకర్ ఉండి, అందులో నగలు, డబ్బు మొదలైనవి ఉంచినట్లయితే. ఇంటి పనిమనిషి ముందు దాని గురించి అస్సలు మాట్లాడకూడదు. మీరు దాని స్థానాన్ని కూడా బయటకు ప్రస్తావించకూడదు. కొందరు ఇంట్లో వారితో మాట్లాడుతూ.. ఫలానా వస్తువు లాకర్ లో ఉంది చూడు, లాకర్ కీస్ ఫలానా చోట ఉంటాయి చూడు అంటూ మాట్లాడుతుంటారు. పని మనిషి చాలామంచిది లే అనుకుంటారు. కానీ ఇది లాకర్ గూర్చి, లాకర్ లో ఉండే వస్తువుల గూర్చి అభద్రతను ఏర్పరుస్తుంది. ఖర్చులు.. ఖర్చుల గురించి మాట్లాడకూడనంత పెద్ద విషయం ఏంటని చాలా మందికి అనిపించవచ్చు. కానీ ఇక్కడ కూరగాయలు, కిరాణా మొదలైన చిన్న ఖర్చులు అయితే పర్లేదు.. కానీ షాపింగ్ కు వెళ్లి వచ్చిన ఖర్చులు.. ఖరీదైన వస్తువులు కొన్న ఖర్చులు. ఖరీదైన వస్తువులు మొదలైనవి చర్చించ కూడదు. నెలకు రూ. 2000 చెల్లించే పనిమనిషి ముందు వేల రూపాయల ఖర్చుల గురించి ప్రస్తావించడం, చర్చించడం.. వాటి గూర్చి చెప్పడం అస్సలు మంచిది కాదు. ప్రయాణాలు.. బయటకు వెళ్లాలని అనుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని పని మనుషులకు చెప్పకుండా ఉండటం మంచిది. ఎక్కడికి వెళుతున్నారు, ఏ సమయానికి వెళతారు, ఎప్పుడు వస్తారు, ఎంత ఖర్చవుతుంది వంటి ఏవైనా వివరాలను ఇంట్లో పనిమనిషి లేనప్పుడు మాత్రమే చర్చించాలి. ఎక్కువ రోజుల ప్రయాణాలు చేయాల్సి వస్తే ఒకరోజులో వచ్చేస్తా అని చెప్పి ఆ తరువాత షెడ్యూల్ మారిందని మీకు కావల్సినన్ని రోజులు పని మనిషిని రావొద్దని చెప్పవచ్చు. కానీ ఇన్ని రోజులు ఊర్లో ఉండను అనే విషాయన్ని ముందే చెప్పకండి. పిల్లల సమాచారం.. పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారు, వారి ఫీజులు ఎంత, వారు కోచింగ్ లేదా ప్రాక్టీస్ కోసం ఎక్కడికి వెళతారు, వారిని ఎవరు పికప్ చేస్తారు, వారి టైమింగ్‌లు ఏమిటి, వారికి పాకెట్ మనీ ఎంత ఇస్తారు, వారు ఎక్కడికి వెళతారు మొదలైనవి పనిమనిషి ముందు లేదా వారితో నేరుగా సమాచారాన్ని పంచుకోవడం చేయకూడదు. మొబైల్, ఇంటర్నెట్.. మొబైల్, ఇంటర్నెట్ వంటి రెండు అంశాలుగ చాలా కీలకంగా మారాయి. ఇవి జీవితంలో సౌలభ్యంతో పాటు అతిపెద్ద భద్రతా ముప్పును కూడా తెచ్చాయి. కొంచెం వివరాలు బయటకు పొక్కినా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీగా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల పని మనిషి ముందు వీటికి సంబంధించిన వివరాలు చెప్పకూడదు. అలాగే వస్తువుల విలువ కూడా బయటకు చెప్పకూడదు.
ఇప్పటి కాలంలో చాలా ఇళ్లలో ఇంటిపని చేయడానికి పని మనుషులను నియమించుకుని ఉంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ పట్టణాలలో ఉంటూ.. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా.. పిల్లలను చూసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఇంటి పనులు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా.. పని మనుషులను పెట్టుకోవడం చాలా మంచి ఆప్షన్ అనుకుంటారు. దీనికి తగ్గట్టే చాలా మంది పని మనుషులు నమ్మకంగా ఉంటారు. నిజాయితీగా పని చేస్తూ ఒకే చోట కాకుండా వివిధ ఇళ్ళలో పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు కూడా. అయితే మనుషుల మీద నమ్మకంతో చాలామంది చాలా విషయాలు పని మనుషుల దగ్గర చర్చిస్తూ ఉంటారు. పని మనిషిని ఇంట్లో మనిషిగా చూస్తూ అన్ని చెప్పుకుంటూ ఉంటారు కూడా. కానీ కొన్ని సార్లు కొన్ని విషయాలు వారి ముందు చర్చించడం వల్ల ఇంటి భద్రతకు, కుటుంబ సభ్యుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/do-you-trust-your-workers-35-189830.html