ఉన్ని దుస్తులు ధరిస్తే దురద పెడుతోందా? ఇలా ఎందుకు అవుతుందంటే..!
Publish Date:Dec 12, 2024
Advertisement
ఉన్ని దుస్తులు ధరించినప్పుడు కొందరికి దురద వస్తుంది. దీనికి టెక్స్టైల్ డెర్మటైటీస్ సమస్య కారణం కావచ్చని అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. దీన్ని ఉన్ని అలెర్జీ అని కూడా పిలుస్తారు. ఉన్ని దుస్తుల ఫైబర్ క్లాత్ కు మానవ శరీర చర్మం టచ్ అయినప్పుడు చర్మం రియాక్షన్ అవుతుంది. దీని వల్ల దురద కలుగుతుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు చలికాలంలో ఉన్ని దుస్తులు ధరించినప్పుడు ఈ ఉన్ని దుస్తుల అలెర్జీ సమస్యను ఎక్కువగా ఎదుర్కుంటారు. ఉన్ని దుస్తుల ఫైబర్స్ ను చర్మం పై రుద్దినప్పుడు చర్మం పై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. దీని కారణంగా చర్మం మరింత కందిపోయనట్టు అవుతుంది. చలికాలంలో ఉన్ని దుస్తులను ధరించడం వల్ల ఇలా అలెర్జీ ఎదుర్కునే సమస్య ఉన్నా సరే.. కొందరు చలికారణంగా వాటినే ధరించాలని అనుకుంటారు. చాలామంది ఇదొక అలెర్జీ సమస్య అనే విషయం కూడా తెలియదు. ఈ కారణంగా అలెర్జీ ఉన్నా సరే దుస్తులు ధరిస్తారు. కానీ ఇలా అలెర్జీ ఉన్నవారు ఉన్నికి బదులు ఇతర ఫ్యాబ్రిక్స్ ను కూడా ఉపయోగించవచ్చు. ఒకవేళ ఉన్ని దుస్తులు ధరించడం వల్ల అలెర్జీ ఎదురవుతూ ఉంటే సింపుల్ గా పాత ఉన్ని స్వెటర్లు, దుస్తులను ఎండలో ఉంచి ఆ తరువాత వాటిని డ్రై క్లీన్ చేసిన తరువాత వాటిని ధరించాలి. అప్పుడే స్కిన్ అలెర్జీలు తగ్గే అవకాశం ఉంటుంది.
సీజన్ ను బట్టి దుస్తులను మార్చడం సహజం. చలికాలంలో ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు ధరిస్తే.. వేసవికాలంలో కాటన్ దుస్తులు ధరిస్తుంటాం. అయితే చలికాలంలో ధరించే ఉన్ని దుస్తుల విషయానికి వస్తే చాలామంది అలెర్జీని అనుభవిస్తారు. ముఖ్యంగా ఈ ఉన్ని దుస్తులు వేసుకోగానే దురదలు వస్తాయి. చలికి ఇబ్బంది పడే చర్మం మీద ఈ ఉన్ని దుస్తుల వచ్చే దురదలు మరింత అసౌకర్యం కలిగిస్తాయి. అయితే.. ఉన్ని బట్టలు ధరించినప్పుడు ఇలా దురద ఎందుకు పెడుతుందో తెలుసుంటే..
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/is-wearing-woolen-clothes-itchy-35-189779.html