స్వతంత్ర భారత్ కి ఉక్కు పునాదులేసిన ఉక్కు మనిషి!

Publish Date:Oct 31, 2016

Advertisement

 

కాలు, చెవ్వు, ముక్కు, ఆఖరుకు గుండె... ఇవన్నీ అంగాలు. అంతే కాదు, ఇవన్నీ ఒక నిర్ధిష్ట ఆకారంతో శరీరంలో ఏదో ఒక చోట వుంటాయి. కాని, రక్తం అలా కాదు. అసలు చాలా మంది రక్తం ఒక అంగం అనుకోరు కాని... అది మన శరీరమంతా వ్యాపించిన అతి కీలకమైన అంగం! రక్తం లేకుంటే మిగతావన్నీ వున్నా జీవితం నిరర్ణకమైపోతుంది! ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ మన ఆధునిక స్వతంత్ర భారతదేశానికి రక్తం లాంటి వాడే!

 

మన హైద్రాబాద్ సంస్థానంతో సహా వందలాది చిన్న చిన్న రాజ్యాల్ని భారతదేశంలో విలీనం చేసిన పటేల్ 31 అక్టోబర్ 1875న గుజరాత్ లో పుట్టారు. ఆయన ఒకవేళ అన్ని రాజ్యాల్ని అంత నేర్పుగా, ఓర్పుగా ఢిల్లీ కంట్రోల్ లోకి తీసుకుని రాకపోయి వుంటే ఇవాళ్ల భారతదేశం ఇలా వుండేదే కాదు. వందలాది కాశ్మీర్లలా రగులుతూ వుండేది. ఆఫ్రికా లాంటి ఖండంలా భారత ఉపఖండం చిన్న చిన్న పేద దేశాల సమూహం అయ్యేది. కాని, పటేల్ తానే భారతదేశానికి రక్తంలా మారి ఆసేతు హిమాచలం ప్రవహించారు! ఒక్కో రాజ్యాన్ని విలీనం చేసుకుంటూ... వినకపోతే విమోచనం చేసుకుంటూ ముందుకు పోయారు! అదే ఆయన అతి పెద్ద విజయం... 

 

వల్లభ్ భాయ్ పటేల్ గాంధీ, నెహ్రులతో పాటూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. 1947లో మనకు స్వేచ్ఛ కలిగేనాటికి ఆయన అత్యంత కీలకమైన నేతల్లో ఒకరు. నిజానికి అప్పటి దేశంలోని అన్ని కాంగ్రెస్ కమిటీలు పటేల్ కే ప్రధానిగా ఓకే చెప్పాయి కూడా. కేవలం ఒకట్రెండు పీసీసీలు మాత్రమే నెహ్రు కావాలని మద్దతు ప్రకటించాయి. అయినా గాంధీ సమక్షంలో నెహ్రునే తొలి ప్రధాని అయ్యారు. పటేల్ హో మంత్రిగా నిలువరింపబడ్డారు. అయినా కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా తన దేశ సేవ విరమించలేదు. నిస్వార్థంగా అరేబియా సముద్ర తీరంలోని జునాగఢ్ మొదలు ఎక్కడో వున్న అసోంలోని చిన్న చిన్న సంస్థానాల వరకూ అన్నిట్నీ భారతదేశం మ్యాపులోకి చేర్చారు.

 

సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ హ్యాండిల్ చేసిన వ్యవహారాల్లో మన హైద్రాబాద్ అత్యంత కీలకమైంది. ఇక్కడ నిజాంకి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పటికీ 1948 వరకూ జనానికి స్వాతంత్ర్యం రాలేదు. మిగతా దేశమంతా స్వేచ్ఛగా మారిపోయినా హైద్రాబాద్ రాజ్యంలోని ప్రజలు నిజాం నిరంకుశ పాలనలోని చీకటిలో మగ్గిపోయారు. చివరకు, ఆపరేషన్ పోలోతో పటేల్ హైద్రాబాద్ ను బేషరతుగా భారత్ లో విలీనం చేశారు. ఆయన ఆర్మీ బలంతో అలా చేయకుంటే ఇవాళ్ల హైద్రాబాద్ కూడా కాశ్మీర్ లా కాష్ఠమై రగిలిపోతూ వుండేది. అలా జరగనీయక భాగ్యనగరాన్ని భద్రంగా భారత్ లో ఐక్యం చేసిన ఆయనకు తెలుగు వారంతా ఎప్పటికీ ఋణపడి వుంటారు. అంతే కాదు, గుజరాత్ లోని జునాగఢ్ రాజ్యం కూడా పటేల్ హైద్రాబాద్ లాగే విజయవంతంగా విలీనం చేశారు. కాని, కాశ్మీర్ విషయంలో నెహ్రు తొందర పాటు చర్యల వల్ల ఇప్పటికీ సమస్య కొనసాగుతూనే వుంది. ఒకవేళ సర్ధార్ జీ కాశ్మీర్ రాజ్యంపై కూడా కన్ను వేసి వుంటే... ఈ పాటికి పాకిస్తాన్ బెడద మనకు వుండేదే కాదంటారు ఆయన అభిమానులు!
ఎవరి మాట ఎలా వున్నా జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకునే పటేల్ జయంతినాడు మనం ఆయన్ని ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఎందుకంటే, వల్లభ్ భాయ్ పటేల్ యావత్ జాతికి హాని చేసే చేత కాని శాంతి వచనాలు పలికిన వాడు కాదు. భరతమాతకి ఏదో మేలో అది మౌనంగా చేస్తూ పోయిన వరుణాస్త్రం...
 

By
en-us Political News

  
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.