ఆయన వల్ల కాంగ్రెస్ గెలవలేదు! కాంగ్రెస్ వల్లే ఆయన ఓడిపోయాడు!

Publish Date:Mar 15, 2017

Advertisement

మిడాస్ టచ్ అంటే మీకు తెలుసా? పూర్వ కాలంలో ఒక రాజు వుండేవాడట. ఆయనకు ఒక వరం వల్ల ఏది ముట్టుకున్నా బంగారమయ్యేదట. దాంతో ఆయన ఫుల్ హ్యాపీ! అయితే, తరువాత అదే వరం కొంపముంచింది! అన్నం, నీళ్లు ముట్టుకున్నా బంగారమైపోయి జీవితం దుర్భరమైంది! ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పకున్నాం అంటే... 

 


ప్రశాంత్ కిషోర్ ... ఈయన ఒక స్ట్రాటజిస్ట్. అంటే వ్యూహకర్త! మనోడి పేరు బాగా జనంలోకి రావటానికి కారణం 2014 పార్లమెంట్ ఎన్నికలు. వాటిల్లో ప్రశాంత్ బీజేపీ కోసం పని చేశాడు. మోదీని ప్రధానిగా గెలిపించటంలో కీలక పాత్ర వుంది. ఆయన పన్నిన వ్యూహాలు నమోకి బాగా ఉపయోగపడ్డాయి. అందుకే, రిజల్ట్స్ తరువాత పీకే సారుకి ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. వెంటనే బీహార్ ఎన్నికల్లో ఆయన్ని నితీష్, లాలూ టీమ్ బుక్ చేసుకుంది. మహాఘట్బంధన్ పేరుతో వారు బీజేపిని మట్టికరిపించటంలో సక్సెస్ అయ్యారు. ఇందులోనూ ప్రశాంత్ కిషోర్ హస్తం వుందని ప్రచారం జరిగింది. ఆయన ముట్టుకుంటే ఏ ఎన్నికలైనా బంగారమే అంటూ పేరొచ్చేసింది! 

 

వరుస విజయాలతో మిడాస్ టచ్ వుందనిపించుకున్న ప్రశాంత్ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పని చేశాడు. మోదీతో కలిస్తే మోదీ రేంజ్లోనే సక్సెస్ వచ్చినట్టు... రాహుల్ తో కలిస్తే రాగా రేంజ్లోనే పీకేకి కూడా ఓటమి ఎదురైంది! ఇప్పుడు యూపీ ఎన్నికల తరువాత ప్రశాంత్ కిషోర్ ను పట్టించుకునే వారే లేరనే స్థితి దాపురించింది! అందుకు కారణం, యూపీలో ఓటమి మాత్రమే కాదు... చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్ లో కూడా ఆయన మ్యాజిక్ పని చేయకపోవటమే!

 

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు యూపీ, ఉత్తరాఖండ్ లలో కాంగ్రెస్ కు పని చేయకపోవటానికి కారణం ... అసలు ఆయన మాటని కాంగ్రెస్ నేతలు విననే వికనపోవటం! పక్కా కాంగ్రెస్ మార్కు కల్చర్ తో ప్రశాంత్ చెప్పేదేదీ కాంగ్రెస్ హైకమాండ్ వినలేదు, నేతలు పట్టించుకోలేదు, కార్యకర్తలు అమలు చేయలేదు. దాంతో పీకే ఖాతాలో చేదు ఓటమి జమకాక తప్పలేదు! అయినా... ఛరిష్మా వున్న నేతల్ని, అంకితభావంతో పని చేసే కార్యకర్తల్ని, పటిష్టమైన సంస్థాగత వ్యవస్థని సృష్టించుకోకుండా... ప్రశాంత్ కిషోర్లని అద్దెకు తెచ్చుకుంటే జనం ఓటు వేసేస్తారా? యూపీలో జరిగింది అదే! కాంగ్రెస్ మునిగింది. ఆ కాంగ్రెస్ ని నడుముకి కట్టుకున్న ప్రశాంత్ కిషోర్ కూడా మునిగాడు!

By
en-us Political News

  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.