మోడీ చేతుల మీదుగా ఐబీఎమ్ క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ : ఫిబ్రవరి 3 ముహూర్తం ఖరారు.!

Publish Date:Nov 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రతిష్టాత్మక ఐబీఎమ్ క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది.

ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో (కేబినెట్ భేటీ) అధికారికంగా వెల్లడించారు. 2027 ఫిబ్రవరి 3వ తేదీన ఈ ఆధునిక క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభోత్సవం జరగనుందని ఆయన కేబినెట్ సభ్యులకు వివరించారు.

ఈ చారిత్రాత్మక ఘట్టానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ క్వాంటమ్ కంప్యూటర్‌ను ప్రారంభించేలా ముహూర్తం ఖరారైందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు రాష్ట్ర ఐటీ, సాంకేతిక రంగానికి సరికొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అత్యాధునిక పరిశోధనలు, సమాచార విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్ మరియు ఏఐ సాంకేతికత అభివృద్ధికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడనుంది.

ఇది కూడా చదవండి: క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ : సీఎం చంద్రబాబు

గ్లోబల్ టెక్ దిగ్గజమైన ఐబీఎమ్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ సెంటర్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, నిపుణులైన యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే అమరావతి రాజధానిని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ ఆశయానికి ఈ క్వాంటమ్ సెంటర్ నిదర్శనంగా నిలవనుంది.

ఐటీ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతను ప్రపంచ పటంలో నిలిపేలా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది.   రానున్న రోజుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన రక్షణ, పరిపాలనాపరమైన ఏర్పాట్లను ముమ్మరం చేయడంతో పాటు, గ్లోబల్ టెక్ ప్రతినిధులను కూడా ఆహ్వానించే దిశగా చర్యలు ప్రారంభం కానున్నాయి. అమరావతి రాజధానిని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ ఆశయానికి ఈ క్వాంటమ్ సెంటర్ నిదర్శనంగా నిలవనుంది.   

మీకు నచ్చవచ్చు:  అమరావతిలో క్వాంటం వ్యాలీ.. వచ్చే ఏడాది జనవరికల్లా రెడీ

తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

[Unveiling Quantum Computer Amaravati Quantum Valley, PM Modi, Febraury 3rd 2027, CBN, Cabinet, IBM Quantum Computer AP Technology Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.