9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుక్కి రూ.2 కోట్ల బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్..!

Publish Date:Nov 11, 2026

Advertisement

పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. చిన్న బహుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ తండ్రి మాత్రం తన కుమారుడి ప్రతిభకు ఇచ్చిన బహుమతి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో ఏకంగా కోట్ల రూపాయల విలువైన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. చదువులో చూపిన ప్రతిభకు తండ్రి ఇచ్చిన ఈ అపురూపమైన కానుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లా గల్సి ప్రాంతంలోని పరాజ్ గ్రామానికి చెందిన షంసుద్దీన్ మిద్యా ప్రముఖ బియ్యం వ్యాపారి. ఆయన కుమారుడు మహమ్మద్ తల్హా వయసు కేవలం 15 ఏళ్లు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే తల్హాకు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారును సొంతం చేసుకోవాలన్నది అతడి కల.

కొడుకుకు కార్లపై ఉన్న ఇష్టాన్ని గమనించిన తండ్రి ఓ మాట ఇచ్చారు. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే నచ్చిన కారు కొనిస్తానని హామీ ఇచ్చారు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో తల్హా చదువుపై దృష్టి పెట్టాడు. పరీక్షల్లో అద్భుతమైన మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో కొడుకు కష్టాన్ని, పట్టుదలను చూసి మురిసిపోయిన తండ్రి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.

అంతే.. కొడుకు కలను నిజం చేసేందుకు ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉన్న బీఎండబ్ల్యూ షోరూమ్‌కు వెళ్లారు. అక్కడ అత్యాధునిక హంగులతో కూడిన బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు. ప్రత్యేక కంటైనర్‌లో కారును తన స్వగ్రామానికి పంపించారు. కోట్ల విలువైన కారు గ్రామానికి చేరుకోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. తమ గ్రామానికి ఇంత ఖరీదైన కారు రావడంతో ఆసక్తిగా తిలకించారు.

ఇది కూడా చదవండి: ఓ రైడ్‌ కొడదాం గురూ.. నగరాల్లో బైక్ ట్యాక్సీల జోరు.. యువతకు చేతినిండా పని.! 

ఈ కారు మార్కెట్ విలువ సుమారు రూ.1.62 కోట్ల నుంచి రూ.2.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇప్పటికే షంసుద్దీన్ వద్ద పలు ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ, కొడుకు చదువులో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ ప్రత్యేకమైన బహుమతిని అందించడం విశేషం.

అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. తల్హా వయసు ఇంకా 15 ఏళ్లే కావడంతో అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీనిపై తండ్రి స్పందిస్తూ, ప్రస్తుతానికి తానే కారును నడుపుతానని, చట్టబద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే కుమారుడికి కారు నడిపే అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కొడుకు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తండ్రిని ప్రశంసిస్తుంటే, మరికొందరు చిన్న వయసులోనే ఇంతటి ఖరీదైన బహుమతి ఇవ్వడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

ఏదేమైనా.. కొడుకు కలను తెలుసుకుని, దాన్ని నిజం చేయడానికి తండ్రి చేసిన ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మార్కుల కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తండ్రి.. తన విజయంతో ఆ మాటను నిజం చేసిన కొడుకు.. ఈ ఇద్దరి కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.!

మీకు నచ్చవచ్చు: రాహుల్‌కు ముందే పుట్టిన మగబిడ్డ.. తొలి కాన్పుపై సోనియా భావోద్వేగ జ్ఞాపకాలు.!

 

 

[ Shamsuddin Midya, BMW M4 Competition, West Bengal businessman, Luxury car gift, Mohammad Talha]
 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.