మరో ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్

Publish Date:Nov 28, 2014

Advertisement

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడప్పుడు తలనరుక్కోవడం వంటి భీకర ప్రతిజ్ఞలు చేస్తుంటారు. కానీ అవసరమయితే మళ్ళీ వాటిని అంతే అలవోకగా తీసి గట్టున పెట్టగలరని దళితుడికి కేటాయించిన ముఖ్యమంత్రి సీటులో ఆయన కూర్చొని నిరూపించి చూపారు. తెలంగాణా సాధన కోసం అవసరమయితే తన తెరాసని కాంగ్రెస్ పార్టీలో కలిపేసేందుకు కూడా సిద్దమేనని ఒట్టువేసి, ఆనక పిల్లాజెల్లాను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి సోనియా గాంధితో గ్రూప్ ఫోటో కూడా దిగి వచ్చి, కాంగ్రెస్ పార్టీకి ‘హస్తం’ (హ్యాండ్) ఇచ్చేసారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నాలుగు స్తంభాలు పాతేసి ఊరూరా విద్యుత్ సరఫరా చేస్తామని అలవోకగా చెప్పారు. కానీ ఇప్పుడు ఓ మూడేళ్ళు ఓపిక పట్టమని అదే నోటితో జనాలకి చెపుతున్నారు.

 

జనాలు కాసేపు తమ సమస్యల నుండి కష్టాల నుండి బయటపడేందుకు సినిమాలకో, షికార్లకో వెళుతుంటారు. బహుశః అదే ఉద్దేశ్యంతోనేనేమో కేసీఆర్ కూడా జనాలకి తన కొత్త బంగారి లోకంలోకి తీసుకువెళ్ళి వారిని మరిపిస్తున్నట్లున్నారు. ఆ బంగారి లోకంలో ఓ హుస్సేన్ సాగర్...దాని చుట్టూ ఓ డజనో అరడజనొ పెట్రోనాస్ టవర్లు, ఓ ఇందిరా పార్క్....దాని పక్కనే ప్రపంచంలో కెల్లా ఎత్తయిన ఓ బిల్డింగ్, ఓ హైదరాబాద్...దానికి ఈకొస నుండి ఆకొస వరకు, హైవేలు, స్కైవేలు, ఎక్స్ ప్రెస్ హైవేలు ఉంటాయి.

 

ఏడాదిలో రాష్ట్రమంతా అద్దంలా మెరిసిపోయే వెడల్పాటి తారు రోడ్లు, రెండేళ్ళలో నీళ్ళతో కళకళలాడే చెరువులు, మూడేళ్ళలో (కంటి రెప్పపడేంత సేపు కూడా అంతరాయం లేకుండా) నిరంతర విద్యుత్ సరఫరా, నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ స్వచ్చమయిన త్రాగునీళ్ళు ఇలా చాలా స్వీట్ డ్రీమ్స్ చూపిస్తున్నారు. ఆశయం గొప్పదయితే లోటు బడ్జెట్టుదేముంది చెట్టును దులిపినా డబ్బులు రాలుతాయి...తితిదేవస్థానాన్ని పిండినా రాలుతాయి. అయితే ఈ కొత్త బంగారి లోకం గురించి ప్రతిపక్షాలు జోకులు వేస్తుంటే, జనాలు కూడా లైట్ గా తీసుకొనే ప్రమాదం ఉందనో మారేమో తెలిదు గానీ, ఒకవేళ ఈ డ్రీం ల్యాండ్ నిర్మించలేకపోతే, వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగబోమని కేసీఆర్ మరో భీకర ప్రతిజ్ఞ చేసారు. అంటే దానర్ధం ఎన్నికలలో పోటీ చేయమని మాత్రం కాదు. పోటీ చేస్తారు కానీ ఓట్లు అడగరని భావించాల్సి ఉంటుంది.

 

అయితే ఇంతవరకు ఆయన ఇలాంటి ప్రతిజ్ఞలు చాలానే చేసారు. చాలానే గట్టున పెట్టారు కనుక దీని సంగతి ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చును. కనుక ఇప్పుడు అందరికీ వినబడేలా గట్టిగానే ప్రతిజ్ఞలు చేసుకోవచ్చును. (ఈ ప్రతిజ్ఞకు షరతులు వర్తిస్తాయి. ఇది కేవలం నీళ్ళ పదకానికి మాత్రమే వర్తిస్తుంది అని గమనించవలెను.)

By
en-us Political News

  
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.