తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, అత్యంత సౌమ్యునిగా పేరుపొందిన కేంద్ర మాజీమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాపు వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గతంలో తెలుగుదేశం లోని ముఖ్యమైన నాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ విధివిధానాల రూపకల్పనలో కూడా ఆయన కీలకపాత్ర వహించారు. ఆయన ఎప్పుడూ పార్టీకి వీరవిధేయతతో ఉండేవారు. అటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒక్కసారిగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.
పార్టీ ప్రస్తుతం గడ్డుపరిస్థితుల్లో ఉందని, దానికి చంద్రబాబునాయుడు అనుసరించే ఒంటెద్దు పోకడలే అంటున్నారు. కాపులను, బిసిలను తెలుగుదేశం పార్టీ విస్మరించింది, గతంలో ఎన్నికల్లో ఈ వర్గాలకు సుమారు 25 టిక్కెట్లు ఇస్తే వారిలో ఐదు నుంచి ఆరుగురు లోక్ సభకు ఎన్నికయ్యేవారని, కాని ఇప్పుడు లోక్ సభలో ఒక్కరు కూడా ఆ వర్గానికి చెందినవారు లేరని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇటీవల రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించారు. అది దక్కకపోవడంతో ఉమ్మారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు చంద్రబాబు వైఖరిలో ఇటీవల వచ్చిన మార్పులు కూడా ఆయనకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. గుంటూరు జిల్లా పార్టీ నాయకులు ఆయనకు పార్టీ సభ్యత్వం కూడా పునరుద్దరించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి వై.ఎస్. జగన్మోహన రెడ్డి పంచన చేరే అవకాశముంది తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-senior-leader-ummareddi-venkateshwarulu-may-join-ysr-cong-24-13800.html
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!