తెలంగాణలో తీవ్ర కరవు పరిస్థితులు..రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం: కవిత

Publish Date:Oct 4, 2026

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన  పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అలుముకున్న కరవు ఛాయలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా సరిగా వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కవిత పేర్కొన్నారు. సరైన వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయని, దీనివల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించి కేంద్ర సహాయం కోసం చర్యలు తీసుకుంటుంటే, ఇక్కడ మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పటికీ అధికార యంత్రాంగం  మంత్రులు కనీస సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించలేదని కవిత తప్పుబట్టారు. కేవలం పూజలు మరియు యాగాలకే పరిమితమైతే ప్రజల సమస్యలు పరిష్కారం కావని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. పంటలను కాపాడుకోవడానికి రైతులకు నిరంతరం విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో బోర్ల కింద ఉన్న పంటలు కూడా ఎండిపోయే దుస్థితి నెలకొందని తెలిపారు.

ఇలాంటి విపత్కర పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని దక్షిణ భారతదేశంలోని కరవు పీడిత రాష్ట్రాలను ప్రత్యేకంగా ఆదుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు. లేనియెడల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి రైతులు సర్వస్వం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర కార్యాచరణను రూపొందించాలని ఆమె డిమాండ్ చేశారు. అన్నదాతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

 

 

 

[ Telangana drought, Kalvakuntla Kavitha, Telangana  government, farmer problems, drought mandals, CM Revanth reddy, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
అత్యవసర అవసరాల నిమిత్తం శ్రీను ఒక మొబైల్ లోన్ అప్లికేషన్ ద్వారా  40 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల నుంచి శ్రీనుకు   వేధింపులు ప్రారంభమయ్యాయి.
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.