మద్యం మత్తు: ప్రజారోగ్యం చిత్తు..!

Publish Date:Oct 7, 2026

Advertisement

తెలంగాణలో  పెరుగుతున్న మద్య వినియోగం సమాజంపై దుష్ప్రభావం చూపుతోంది.  మద్యాన్ని ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా పరిగణిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం, ప్రజారోగ్యం మధ్య పెరిగిపోతున్న అంతరం ఆందోళన కలిగిస్తున్నది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6) వెల్లడించిన గణాంకాలు భీతికొల్పుతున్నాయి.

మద్యం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నది అందులో సందేహం లేదు. కానీ అదే సమయంలో  సామాజిక నిర్మాణం, మానవ వనరుల ఉత్పత్తి  కుటుంబాల ఆర్థిక పరిస్థితి   దెబ్బతింటున్నాయి.    మద్యాన్ని   కీలక ఆదాయ వనరుగా చూడటం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఊహించుకోవడానికే భయం వేస్తున్నదని సామాజిక వేత్తలు అంటున్నారు. 

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6 నివేదిక ప్రకారం, తెలంగాణలో  15 ఏళ్లు   అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో ఏకంగా 43.9 శాతం మంది తాము మద్యం అలవాటు ఉన్నావారే. ఇది జాతీయ సగటు 18.9 శాతం కంటే చాలా చాలా ఎక్కువ.  ఇక మహిళల విషయానికి వస్తే, జాతీయ స్థాయిలో  మద్యం అలవాటు ఉన్న మహిళల శాతం 1.1కాగా తెలంగాణలో  ఇది 7.1 శాతం. దేశంలోని ఇతర  రాష్ట్రాలతో పోలిస్తే పురుషుల మద్య వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఈ పరిస్థితి ఒక్క పట్టణ ప్రాంతాలకే పరిమితం కాలేదు. గ్రామీణ తెలంగాణంలో కూడా మద్యం వినియోగించే పురుషుల సంఖ్య జాతీయ సగటు కంటే అధికంగానే ఉంది.

 గ్రామీణ ప్రాంతాల్లో 46.6 శాతం మంది పురుషులు మద్యం అలవాటుకు బానిసలయ్యారని ఎన్ఎఫ్ హెచ్ఎస్-6 నివేదిక పేర్కొంది. అలాగే, పట్టణ ప్రాంతాల్లో ఇది  36.3శాతంగా ఉంది. దీనిని బట్టి మత్తు సంస్కృతి పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఉందని తేటతెల్లమౌతోంది.    అయితే.. ఈ సర్వే కేవలం మద్యం సేవించే వారి శాతాన్ని మాత్రమే చెబుతుంది. మద్యం కోసం చేసే వ్యయం, మద్యం తాగే పరిణామం ఈ సర్వే పరిధిలోకి రావు. అయితే..  రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన ఎక్సైజ్ ఆదాయం, మద్యం విక్రయాల జోరును బట్టి చూస్తే సమస్య తీవ్రత ఇట్టే అవగతమౌతుంది. 

తెలంగాణలో మద్యం విక్రయాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో   40 వేల 209 కోట్ల రూపాయలు.  లైసెన్స్ ఫీజులు,  ఇతర రసీదులతో కలిపి మొత్తం ఎక్సైజ్ ఆదాయం రూ. 44 వేల కోట్ల రూపాయల పై మాటే.   ప్రభుత్వాలు సమాజంలో హానికరమైన వస్తువులపై పన్నులు విధించడం, నియంత్రించడం సాధారణమే అయినప్పటికీ, మద్యం నిషేధం, మద్యం లబ్ధిదారు కూడా ఇక్కడ ప్రభుత్వమే కావడం వల్ల సమస్య తీవ్రం అవుతోంది.  ప్రభుత్వమే మద్యాన్ని నియంత్రిస్తుంది, విక్రయాలకు లైసెన్సులు ఇస్తుంది, పన్నులు వసూలు చేస్తుంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయం వల్లనే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉంది,

 అదే సమయంలో మందుబాబుల ఆరోగ్యాన్ని కాపాడాలని, దుష్ప్రభావాలను తగ్గించాలని ప్రభుత్వం అనుకుంటుందనుకోవడం అత్యాశే అవుతుంది.  ప్రభుత్వ ఖజానాకు ఎక్సైజ్ రూపంలో పైసలు వచ్చి చేరుతోంది. ఇక మద్యం దుష్ప్రభావాన్ని మాత్రం సమాజం, అంటే సామాన్య జనం అనుభవించాల్సి వస్తోంది.  

ఈ మద్యపాన వ్యసనం కారణంగా అత్యధికంగా నష్టపోతున్నది. కూలీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారే.  ధనవంతులకు మద్యం ఖర్చు పెద్ద లేక్కలోకి రాదు. అది వారి లగ్జరీకి నిదర్శనంగా కూడా కొండొకచో మారుతుంటుంది. కానీ దినసరి కూలీలు, కార్మికులకు మాత్రం ఈ అలవాటు వారి జీవనంపై ప్రభావం చూపుతోంది. మద్యం అలవాటు కారణంగా పేదల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమౌతోంది.    ఒక రోజు కూలీ తన సంపాదనను మద్యం కోసం వెచ్చించడం వల్ల ఇంట్లో పూట గడవని పరిస్థితి ఏర్పడుతోంది.   పోషకాహారం అందక అనారోగ్యాల బారిన పడటం ఆ కారణంగా  ఉత్పాదకత తగ్గి కుటుంబ ఆదాయం మరింత క్షీణించడం జరుగుతుంది. ఈ దుర్వ్యసనం కారణంగా కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి, పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి.

ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి. మద్యం దుష్ప్రభావం కారణంగా వాటిల్లే నష్టాలను పూడ్చేందుకు   ఆ నిధులు ఏ మూలకూ సరిపోవు.  అందుకే ప్రభుత్వాలు కేవలం ఆదాయాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టకుండా, మద్యపాన నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని పరిశీలకులు అంటున్నారు.  ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసేలా ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత విధాన రూపకర్తలపై ఉందంటున్నారు.

[Telangana liquor consumption High National Aerage,  NFHS6 survey Telangana, Excise Revenue Telangana, Rural Alcoholism Telangana, Government Liquor Policy, Telugu One] 

By
en-us Political News

  
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.