అడిగింది ఆడదే.. న్యాయం జరగాలని: నెక్లెస్ రోడ్డుపై అర్ధరాత్రి మహిళలు నిరసన.!

Publish Date:Oct 4, 2026

Advertisement

మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మరోసారి అర్ధరాత్రి సందేశాలతో మార్మోగింది. శనివారం రాత్రి మహిళలు, క్వీర్ కమ్యూనిటీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి “మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు స్వేచ్ఛగా సంచరించే హక్కును చాటిచెప్పడమే ఈ మార్చ్ ప్రధాన ఉద్దేశం. మహిళల భద్రత పేరుతో వారినే ఇంటికే పరిమితం చేయడం కాకుండా.. రాత్రి వేళల్లోనూ మహిళలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమం సాగింది.“ఈ రోడ్లు పురుషులకేనా..?ఈ నగరం పగటి పూట మాత్రమే మాదా..?రాత్రి అయితే మహిళలు ఎందుకు భయపడాలి..?” అంటూ మిడ్నైట్ మార్చ్ ద్వారా ప్రశ్నలు సంధించారు.

హైదరాబాద్‌లో మిడ్నైట్ మార్చ్ నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. 2013లో ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత హైదరాబాద్‌లోనూ ఇదే తరహాలో మిడ్నైట్ మార్చ్ నిర్వహించారు. అప్పట్లో నెక్లెస్ రోడ్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని.. మహిళలు అర్ధరాత్రి వేళల్లోనూ బహిరంగ ప్రదేశాలను స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు తమదేనని చాటిచెప్పారు.ఆ ఉద్యమం కేవలం ఓ నిరసనగా మాత్రమే కాకుండా.. “మహిళలు రాత్రి వేళల్లో బయటకు రావద్దు” అనే సామాజిక భావనకు సవాల్‌గా నిలిచింది. మహిళలకు వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉందని వారిపైనే ఆంక్షలు విధించడం కంటే.. వేధింపులకు పాల్పడే వారిని ప్రశ్నించాలన్న ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది.

ఈ కార్యక్రమంలో క్వీర్ కమ్యూనిటీతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు కూడా పాల్గొన్నారు. మహిళల భద్రతతో పాటు లింగ గుర్తింపుల కారణంగా అసురక్షిత పరిస్థితులను ఎదుర్కొనే ప్రతి ఒక్కరికీ బహిరంగ ప్రదేశాల్లో సమాన హక్కులు ఉండాలన్న సందేశాన్ని వినిపించారు. ఏళ్లు గడిచాయి.. నగరం మారింది.. జీవన విధానం మారింది.. కానీ రాత్రి వేళల్లో మహిళల స్వేచ్ఛ, భద్రత, సమాన హక్కుల ప్రశ్న మాత్రం ఇంకా చర్చకు వస్తూనే ఉంది. అందుకే మరోసారి నెక్లెస్ రోడ్డుపై అర్ధరాత్రి అడుగులు పడ్డాయి.కాలం మారినా.. ఈ గోస మారదా..?అడిగింది ఆడదే..దానం కాదు.. హక్కు కావాలని.! జాలి కాదు.. న్యాయం కావాలని.!ఆంక్షలు కాదు.. స్వేచ్ఛ కావాలని.! అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డుపై వినిపించిన ఈ గొంతుక.. కేవలం ఓ రాత్రి నినాదం కాదు. నగరంలోని బహిరంగ ప్రదేశాలు ఎవరివి? మహిళలు రాత్రి వేళల్లోనూ భయంలేకుండా తిరిగే హక్కు ఎప్పుడు పూర్తిగా సాధ్యమవుతుంది? అనే కీలక ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చిన ఉద్యమం.

 

 

[ Midnight March, Hyderabad, Necklace Road, Women Rights, Women Safety, Gender Equality, Reclaiming Public Spaces, LGBTQ Community, Queer Community, Women Empowerment, Public Spaces, Night Safety, Hyderabad Women, Gender Justice, Women's Freedom ]

By
en-us Political News

  
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.