రంగు మారిన కృష్ణా జలాలు: చేపలు మృత్యువాత.. జల కాలుష్యంపై మత్స్యకారుల ఆందోళన.!

Publish Date:Oct 6, 2026

Advertisement

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో కీలకమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణా నది నీరు  ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా బ్యాక్‌వాటర్‌లో నీటి రంగులో  మార్పు కనిపిస్తుండటంతో స్థానికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నుంచి దుర్వాసన వస్తోందని, కొన్ని ప్రాంతాల్లో చేపలు మృత్యువాత పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   జూరాల ప్రాజెక్టు ప్రాంతంలో గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదని అంటున్నారు.   నీటి ఉపరితలంపై ముదురు ఆకుపచ్చ రంగు  పొర కనిపించడంతో పాటు దుర్వాసన కూడా వస్తోందని స్థానికులు చెబుతున్నారు.    

జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  స్థానికుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు వద్ద పరిశీలన చేపట్టారు. అక్కడ సుమారు 30 నుంచి 40 శాతం మేర నీరు ఆకుపచ్చగా కనిపించినట్లు అధికారులు గుర్తించారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాల పరీక్షలకు పంపించారు.  ఫలితాలు రావాల్సి ఉంది. 

అదలా ఉంటే.. నీటి కాలుష్యం కాదనీ, నాచు కారణంగానే నీరు ఆకుపచ్చగా కనిపిస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. అయితే స్థానికులు మాత్రం ఎగువ ప్రాంతాలలోని పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలవడం వల్లనే నీరు కాలుష్యమైందని అంటున్్నారు.  కర్ణాటకలోని రాయచూరు పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే రసాయన వ్యర్థాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. 

అయితే అధికారులు మాత్రం నాచు కారణంగానే నీటి రంగు మారిందని అంటున్నారు.  కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశీలించిన నీటి నమూనాల్లో రసాయన కాలుష్యానికి సంబంధించిన ఆధారాలు కనిపించలేదని నివేదికలను ఉటంకిస్తూ అధికారులు చెబుతున్నారు.  అయితే  చేపలు మృత్యువాతకు నాచు కాదు నీటి కాలుష్యమే కారణమని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

అంతే కాకుండా నీటిలో దిగిన తమకు  దురద, అలర్జీ వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ కాలుష్యాన్ని నిర్ధారించే ఆధారాలు లేవని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. మొత్తంగా  నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాల పరీక్షలకు పంపామనీ, ఫలితం వచ్చిన తరువాతనే ఒక నిర్ణయానికి రాగలమని చెబుతున్నారు.  

ఇదిలా ఉంటే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని నాగార్జునసాగర్‌ వద్ద కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు ఆకుపచ్చగా మారడం గమనార్హం. అక్కడ కూడా కాలుష్య నియంత్రణ అధికారులు నీటిని పరీక్షించగా రసాయన కాలుష్యానికి సంబంధించిన ఆధారాలు లభించలేదని, అడుగుభాగంలోని నాచు పైకి రావడం వల్ల నీరు ఆకుపచ్చగా కనిపిస్తోందని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం జూరాల వద్ద నీటి నమూనాల పరీక్షా ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. నీటి రంగు మారడానికి నాచే కారణమా, లేక కాలుష్యమా? చేపల మృతికి అసలు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు ప్రయోగశాల నివేదికలతోనే స్పష్టత వస్తుంది.  

[Jurala Project  Water Colour Green, Krishna River Pollution, Gadwal, Fish deaths, Telangana Water Pollution, Telugu One]

By
en-us Political News

  
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.