తెరాస వ్యూహానికి తెదేపా చెక్!

Publish Date:Nov 5, 2015

Advertisement

 

ఇంతకు ముందు తెదేపాలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తెరాస ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ ఇంతవరకు తన రాజీనామాను స్పీకర్ చేత ఆమోదింపజేసుకోకపోవడం చేత ఆయనే నేటికీ సనత్ నగర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సనత్ నగర్ నియోజక వర్గంలో ఆంధ్రాకు చెందిన ప్రజలు చాలా మంది స్థిరపడున్నారు. ఇదివరకు తలసాని తెదేపాలో ఉన్న కారణంగా వారు ఆయనకు ఓటు వేసి గెలిపించారు. కానీ ఆయన తెదేపాలో ఉంటారని భావించి ఓట్లు వేసి గెలిపిస్తే, తమ అభీష్టానికి విరుద్దంగా ఆయన తెరాసలో చేరడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కనుక ఆయన మళ్ళీ సనత్ నగర్ నుంచి పోటీ చేస్తే వాళ్ళ ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉండకపోవచ్చును. బహుశః ఆ భయంతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఇంతవరకు ఆమోదింపజేసుకోలేదని భావించవచ్చును. కానీ ఏదో ఒకనాడు అదే సనత్ నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయక తప్పదు. ఆయన తెదేపాను వీడి తెరాసలో జేరినప్పుడు ఆయనతో బాటు ఆయన అనుచరులు కూడా తెరాసలో చేరారు. అయితే నేటికీ సనత్ నగర్ నియోజక వర్గంలో తెదేపా చాలా బలంగానే ఉంది. కనుక ఈ పరిస్థితిలో తెదేపాను బలహీనపడితే తప్ప అక్కడ తలసాని విజయం సాధించడం అసంభవం. అందుకే సనత్ నగర్ నియోజక వర్గానికి తెదేపా ఇన్-చార్జ్ గా వ్యవహరిస్తున్న కూన వెంకటేష్ గౌడ్ ని తెరాసలోకి ఆకర్షించే ప్రయత్నాలు జరిగాయి. వెంకటేష్ గౌడ్ తెదేపాకు గుడ్ బై చెప్పి తెరాసలోకి వెళ్లిపోబోతున్నారని ఆ మధ్యన మీడియాలో వార్తలు వచ్చేయి.

 

తెదేపా కూడా దీనికి విరుగుడుగా ఒక వ్యూహం అమలు చేస్తోంది. సనత్ నగర్ నియోజక వర్గానికి జరుగబోయే ఉప ఎన్నికలలో తెదేపా అభ్యర్ధిగా కూన వెంకటేష్ గౌడ్ నే నిలబెట్టాలని నిశ్చయించుకొంది. దానితో తెరాస వ్యూహం బెడిసి కొట్టినట్లయింది. ఎవరిని తమ పార్టీలోకి ఆకర్షించాలని అనుకొందో వారితోనే తలపడాల్సిన పరిస్థితి ఎదురయింది.

 

అసలు ఆయన గత ఎన్నికలలోనే సనత్ నగర్ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ సీటును తలసానికి ఇవ్వవలసి వచ్చింది. కానీ ఆయన తెదేపాకు హ్యాండిచ్చి తెరాసలోకి వెళ్ళిపోయారు. తనకు దక్కవలసిన సీటును తలసాని దొంగిలించుకొని పారిపోయారని వెంకటేష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఈసారి తనకే సనత్ నగర్ నుండి పోటీ చేసే అవకాశం ఇస్తామని తెదేపా అధిష్టానం స్పష్టమయిన హామీ ఇవ్వడంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు.

 

గత శుక్రవారం బేగంపేటలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలు నేతల సమావేశంలో కూన వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ “నేను పార్టీని వీడుతానని మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. నా చివరి శ్వాస వరకు తెదేపాలోనే కొనసాగుతాను. పార్టీ కోసం పనిచేతూనే ఉంటాను. ఆదరించిన పార్టీని మోసం చేసి తెరాసలో వెళ్ళిన వారందరికీ ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలి. తెలంగాణాలో, మన నియోజక వర్గంలో తెదేపాను పటిష్టపరిచేందుకు మనమందరం కలిసి కృషి చేయాలి,” అని కోరారు.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.