అమరావతి.. సస్టైనబుల్ గ్లోబల్ సిటీ.. చంద్రబాబు విజన్ కు దర్పణం!

Publish Date:Jun 16, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతి చంద్రబాబు విజన్ కు దర్పణం పట్టేవిధంగా రూపుదిద్దుకుంటోంది.  రాజధాని నగరం అమరావతి కేవలం భవనాల నగరం మాత్రమే కాదు.. ఈ మహానగరం అందరికీ  కొత్త అనుభూతిని పంచే  ఎక్స్‌పీరియన్స్ సిటీ గా రూపుదాల్చాలన్నదే చంద్రబావు విజన్.  ఇటీవలి సింగపూర్ పర్యటన, అలాగే అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.  

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీని నిర్మించి..  హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన   చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు.  ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, క్వాంటం   వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీల సమ్మేళనంగా  అమరావతి రూపుదిద్దుకుంటున్నది. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి   పరిపాలనా నగరంగానే కాకుండా..  ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.  పర్యావరణ హితంగా ఉండేలా స్మార్ట్, బ్లూ అండ్ గ్రీన్ సిటీ కాన్సెప్ట్‌తో  అమరావతి రూపుదిద్దుకుంటోంది.  దేశవిదేశీ సంస్థలను, ప్రపంచస్థాయి విద్యాసంస్థలను ఇక్కడికి ఆకర్షించడం ద్వారా ఈ ప్రాంతాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా సీబీఎన్ ముందుకు సాగుతున్నారు. 

ఇందులో భాగంగానే సింగపూర్ పర్యటనలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రతిష్టాత్మక నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్ యూఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ టాన్ ఎంగ్ చ్యేతో  జరిపిన భేటీలో.. అమరావతిలో ఎన్‌యూఎస్,  బ్రాంచ్ లేదా శాటిలైట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.  ఏపీలో ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచ స్థాయి పరిశోధనలకు అమరావతిని వేదికగా మార్చాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే..గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామిగా ఉన్న సింగపూర్ బృందం, మళ్లీ ఇప్పుడు రాజధాని నిర్మాణ పురోగతిని తెలుసుకుని ఇక్కడ తమ ఉనికిని చాటుకునేందుకు తహతహలాడుతోంది.

అమరావతిని గ్లోబల్ హబ్‌గా మార్చే వ్యూహంలో అత్యంత కీలకమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్..  భవిష్యత్ సాంకేతికత అయిన క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  రంగాల్లో అమరావతి దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు.. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. క్వాంటమ్ వ్యాలీలో నిర్మించబోయే అద్భుతమైన ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్ కోసం  1,208.41 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే సెక్రటేరియట్, అడ్మినిస్ట్రేటివ్ టవర్ల ఫాసాడ్, స్ట్రక్చరల్ పనుల కోసం రెండు వేల 540 కోట్ల రూపాయలు,  అసెంబ్లీ భవన పనుల కోసం 798 కోట్ల రూపాయలు కేటాయించారు.  కృష్ణా నదిపై పాతిక వందల కోట్లతో నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 

అలాగే.. బిట్స్ పిలానీ వంటి ప్రముఖ సంస్థలు   250 కోట్ల  రూపాయల పెట్టుబడితో   అమరావతి క్యాంపస్‌ను సిద్ధం చేస్తున్నాయి.  2027 నాటికి ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభించి, దాదాపు పదివేల మంది విద్యార్థులకు క్వాంటమ్, ఏఐ విభాగాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం విద్యారంగమే కాకుండా గ్యాస్, పవర్, వాటర్ సప్లై కోసం అండర్‌గ్రౌండ్ యుటిలిటీ డక్ట్స్,  డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన మౌలిక వసతులతో అమరావతి నిజమైన గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్ సిటీగా అవతరించబోతున్నది.  

ఇటీవల ఢిల్లీలో జరిగిన  రైసినా డైలాగ్ వేదికగా చంద్రబాబు.. ఎవరైతే సుదీర్ఘకాలం, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనుకుంటున్నారో.. వారు అమరావతికి రావాలి అంటూ పిలుపునిచ్చారు.  కాలుష్య రహిత వాతావరణం, గ్రీన్-బ్లూ సిటీ కాన్సెప్ట్, అత్యాధునిక అండర్‌గ్రౌండ్ డక్ట్ సిస్టమ్స్ ద్వారా అమరావతిని గ్లోబల్ లెవన్ జీవన ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందంటే అది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం. ఈ క్రమంలో  ఎన్నో ఆటంకాలు, మరెన్నో పొలిటికల్ చాలెంజెస్ ఎదురయ్యాయి. చంద్రబాబు పట్టుదల, అకుంఠిత దీక్ష, విజన్ తో వాటన్నిటినీ అధిగమించి.. దేశంలోనే తొట్ట తొలి సస్టైనబుల్ గ్లోబల్ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నారు.  

By
en-us Political News

  
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.