ఇప్పుడిక సమాజ్ వాదీ పార్టీ వంతు!

Publish Date:Jun 17, 2026

Advertisement

 

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి పార్లమెంటు ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల  మెజార్టీని సాధించడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది.   కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన  బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధమైన ఆమోదం లభించాలంటే ఈ  మెజార్టీ అత్యంత కీలకం. ఈ బిల్లును ఎలాగైనా గట్టెక్కించేందుకు వీలుగా విపక్ష ఇండియా కూటమిని బలహీనపరిచే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తున్నది.  ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో  తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుమారు 20 మంది ఎంపీలు, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఆరుగురు  లోక్‌సభ సభ్యులు తిరుగు  బావుటా ఎగురవేసి స్పీకర్‌కు లేఖలు సమర్పించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

 ఇప్పుడు బీజేపీ  సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ  ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.  ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది. మహారాష్ట్ర, బెంగాల్ తరహాలోనే త్వరలోనే సమాజ్‌వాదీ పార్టీలోనూ అతిపెద్ద చీలిక రాబోతోందనీ, ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, సీనియర్ నేతలు ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారంటూ   ఓం ప్రకాష్ రాజ్‌భర్  వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. పాత కేసుల ఉచ్చు బిగుస్తుండటంతో కొందరు ఎస్పీ ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ బాట పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.  అయితే సమాజ్‌వాదీ పార్టీ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. మూడింట రెండు వంతుల మెజార్టీ కోసం ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి  డ్రామాలకు తెరలేపిందని పేర్కొంది.

అయితే..   చీలికల నుంచి తన పార్టీని కాపాడుకోవడానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వై కేంద్రంతో నేరుగా ఘర్షణ పడే వైఖరిని పక్కనపెట్టి, తమ పార్టీ జోలికి రాకుండా ఉండేలా ఆయన ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు ఫార్ములాపై అఖిలేష్ యాదవ్ సభలో  చాలా సానుకూలంగా స్పందించడాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   50 శాతం సీట్ల పెంపు ఫార్ములాను అధికారికంగా డీలిమిటేషన్ బిల్లులో చేరిస్తే తాము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని అఖిలేష్ సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సక్సెస్ అయితే ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సీట్ల పెంపు ఫార్ములాకు అఖిలేష్ కూడా ఆమోదం తెలపడంతో బీజేపీ హైకమాండ్‌కు ఆయన వైపు నుండి   లైన్ క్లియర్ అయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒకవేళ ఈ సీట్ల పెంపు ఫార్ములా ఒప్పందం గనుక కుదిరితే, సమాజ్‌వాదీ పార్టీని చీల్చాల్సిన అవసరం బీజేపీకి ఉండకపోవచ్చంటున్నారు. దీనివల్ల అఖిలేష్ యాదవ్ తన పార్టీని కాపాడుకుంటూనే, వ్యూహాత్మకంగా సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారని చెబుతున్నారు.  

By
en-us Political News

  
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.