ఫ్రీ పబ్లిసిటీ లడ్డూ కావాలా నాయనా... శోభా డేను ఫాలోకండి!

Publish Date:Aug 21, 2016

Advertisement

 

అడుసు తొక్కనేలా కాలు కడగనేలా.... ఇదో చాలా పాత సామెత! అంతకంటే పురాతన విమర్శకురాలు శోభా డే! అవును... ఆమె అప్పుడెప్పుడో కొన్ని పుస్తకాలు రాసిందంటారు. అవి కూడా బూతు సాహిత్యం అని కొందరు కొట్టిపారేస్తారుగాని చాలా వరకూ బోల్డ్ రైటింగ్స్ అని మెచ్చుకుంటారు! అయితే, శోభా డే ఎంతమందికి నచ్చినా, నచ్చకపోయినా పేజ్ త్రీ సర్కిల్స్ లో మాత్రం సూపర్ పాప్యులర్. పైగా ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియా జడలు విప్పిన తరువాత, సోషల్ మీడియా విశృంఖలంగా మారిన తరువాత ఈమెకి ఎక్కడ లేని ఇంపార్టెన్స్ వచ్చింది. అది తాజా రియో ఒలంపిక్స్ సందర్భంలో నానా యాగీకి కారణమైంది...

 

ఒలంపిక్స్ లో భారత్ పర్ఫామెన్స్ పెద్దగా అభినందనీయంగా వుండదనేది ఇప్పుడే కొత్తగా తెలిసిందేం కాదు. అసలు ఒలంపిక్స్ చరిత్రలో ఎప్పుడూ ఇండియా ఇరగదీసింది  ఏం లేదు. కాని, శోభా డే వున్నట్టుండీ ట్విట్టర్ లో చెలరేగిపోయింది. ఆ మధ్య మోదీ సర్కార్ వచ్చాక అసహనం పెరిగిపోయిందని, మైనార్టీల కంటే ఎక్కువగా తానే భయపడిపోతున్నానని శోభా డే తెగ ఆవేశపడింది. అప్పుడు కూడా ఆమెను ట్విట్టర్ లో జనం అదేదో చేసి చెవులు మూసినంత పని చేశారు. అంతే మరి... కాంగ్రెస్ వున్నంత కాలం ఏ మాత్రం గుర్తుకు రాని అసహనం బీజేపి రాగానే శోభా డేకు జ్ఞాపకం వచ్చిందంటే ఏమనాలి?

 

ట్విట్టర్ ద్వారా ట్రాల్ అవుతూ మీడియాలో మజా చేయటం ఓ సారి అలవాటయ్యాక ఎవరికైనా ఆ ఫ్రీ పబ్లిసిటీ ఎలా వదులుకోబుద్దవుతుంది? అందుకే, ఒలంపిక్స్ రాగానే శోభా కొత్త శోభతో వెలిగిపోయింది. అథ్లెట్లు రియోకు వెళ్లేది సెల్ఫీలు తీసుకోవటానికని నోటికొచ్చినట్టు కామెంట్స్ చేసింది. అందుకు ప్రతిఫలంగా టీవీ ఛానల్స్ మొదలు అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ వరకూ అంతటా, అంతా శోభాకు మొట్టికాయలు వేశారు. మరీ ముఖ్యంగా సింధు, సాక్షి మాలిక్ పతకాలు గెలిచాక శోభా డేకు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు.

 

ఒలంపిక్స్ విషయంలో తన వాగుడు అసలుకే మోసం తెచ్చిందనుకున్న శోభా డే ఇక రియో సంబరాలు అయిపోతున్న వేళ సింధు, దీపా కర్మాకర్, సాక్షీల్ని తెగ పొగిడేస్తు తాజా ట్వీట్స్ చేసింది. ఆహా ఓహో అంటూ ప్లేటు ఫిరాయించింది! మరి ఈ మాత్రం దానికి కొన్ని రోజులు పాటూ నెగటివ్ ట్వీట్స్ చేస్తూ డ్రామాలు నడపటం ఎందుకు? పబ్లిసిటీ కోసమేనా? అయితే, శోభా సక్సెస్ అయినట్టే! ఆమె గాని పిచ్చి మాటలు మాట్లాడి వుండకపోతే ఎవ్వరూ పట్టించుకునే వారు ఈ ముదురు రైటర్ అండ్ జర్నలిస్ట్ ని! 

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.