TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

నాపై చర్యలంటే.. ముందు సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి : కొండా సురేఖ

ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..! మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ చెప్పుకోవడం మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీ హస్తిన వీధులకు చేరింది. కొండా సురేఖ ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యల దుమారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పార్టీ క్రమశిక్షణపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై స్పష్టత నిమిత్తం సురేఖకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుమారు 60 నిమిషాల (1 గంట) పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ నియమావళిని దాటి వ్యవహరించే నేతలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి మరియు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. అయితే ఊహించని మలుపు తిరుగుతూ మంత్రి కొండా సురేఖ కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడంతో వరంగల్ రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కొండా సురేఖ అత్యంత ఘాటుగా స్పందించారు. "నన్ను అధిష్టానం పిలవలేదు, నేనే స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్ అడిగి ఢిల్లీకి వచ్చాను. పార్టీలో ఉన్నది మాట్లాడితే చర్యలు ఎందుకు తీసుకుంటారు?" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టించాయి. పార్టీ శ్రేణుల సంక్షేమం మరియు ప్రాంతీయ సమతుల్యత కోసమే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశామని, నిజ నిజాలు చెప్పడం క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో విడివిడిగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ వివాదానికి వీలైనంత త్వరగా స్వస్తి చెప్పాలని అధిష్టానం భావిస్తోంది. మంత్రి వర్గంలో 100 శాతానికి పైగా క్రమశిక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా కుటుంబం తమ స్వరాన్ని బలంగా వినిపిస్తోంది. పార్టీ మూలాలకు హాని కలగకుండా, సురేఖ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలా? లేక కేవలం వివరణతో సరిపెట్టి వ్యవహారాన్ని సర్దుమణిగేలా చేయాలా? అనే అంశంపై ఏఐసీసీ పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ తీవ్ర చర్యలు తీసుకుంటే ఉమ్మడి వరంగల్ పరిధిలోని దాదాపు 12 నియోజకవర్గాల్లో పార్టీ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ హైడ్రామాలో రాబోయే 24 గంటల్లో వెలువడే అధిష్టానం నిర్ణయమే మంత్రి కొండా సురేఖ భవిష్యత్తును నిర్ణయించనుంది. Konda Surekha Delhi visit, Revanth Reddy Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news

Published on: Wed Sep 2, 2026 3:54PM

political-news-img

రేవంత్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చార్జిషీట్.!

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుకి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విమర్శలకు పదును పెట్టింది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్‌ విడుదల చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల అమలులో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రజలను మాయమాటలతో వంచించి అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్, ఈ వెయ్యి రోజుల పాలన ఇసుమంతైనా సంతృప్తికరంగా లేదని విమర్శించారు. రైతాంగం, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థుల జీవితాలతో రేవంత్ ఆటలాడుతోందని బీఆర్‌ఎస్ ఆ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరాకు అందిస్తామన్న 15 వేల రూపాయల సాయాన్ని నిలిపివేసి రైతులను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించింది. అలాగే వ్యవసాయ కూలీలకు చెల్లిస్తామని వాగ్దానం చేసిన 12 వేల రూపాయల ఆర్థిక సాయం కూడా నీటి మూటగానే మిగిలిందని చార్జ్ షీట్ పేర్కొంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియను అసంపూర్తిగానే మిగిలిందనీ, సగం సగం లెక్కలతో రైతులకు అన్యాయం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శించారు. యువత, విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని బీఆర్ఎస్ చార్జ్ షీట్ పేర్కొంది. నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించిన 4 వేల రూపాయల నిరుద్యోగ భృతితో పాటు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ పూర్తిగా నీటిమూటగా మారిపోయిందని విమర్శించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం, గురుకుల పాఠశాలలను మూసివేసే దిశగా కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ చార్జిషీట్ పేర్క్ంది. విద్యార్థులకు వాగ్దానం చేసిన 5 లక్షల విద్యా భరోసా కార్డు ఆచరణకు నోచుకోలేదని, 12 వేల కోట్ల రూపాయలకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనీ, అలాగే.. మహిళలకు ఇస్తామన్న నెలకు 2 వేల 500 రూపాయల ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న తులం బంగారం హామీలను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించిందని విమర్శించారు. అంతేకాకుండా, బాధ్యతారహితమైన ఆర్థిక నిర్ణయాల వల్ల తెలంగాణను దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను, హామీల అమలును ప్రశ్నించిన నాయకులు, ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. [BRS chargesheet on Congress, KTR press meet, Telangana Congress 1000 days, Revanth Reddy government failures, BRS vs Congress, Telangana politics, Telugu One]

Published on: Wed Sep 2, 2026 2:46PM

political-news-img

ఎమ్మెల్యేగా కేసీఆర్ వేతనాలపై రేవంత్ ధ్వజం.!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇన్నేళ్లలో ఆయన అసెంబ్లీకి హాజరైన సందర్భాలు ఒకటి రెండు కంటే ఎక్కువ లేవు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం ఆయన జీత భత్యాలను నిర్మొహమాటంగా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, అసెంబ్లీని గౌరవించడంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్‌ను లక్ష్యం విమర్శలు గుప్పించడానికి ఎంచుకోవడం తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఎమ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టి కూడా నిస్సిగ్గుగా గత రెండేళ్లలో కేసీఆర్ జీతం రూపంలో రూ. 1.24 కోట్లు తీసుకున్నారని రేవంత్ పేర్కొన్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ఎమ్మెల్యేగా కేసీఆర్ జీత భత్యాలు తీసుకుంటున్నారన్న అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హాట్ హాట్ గా వైరల్ అయ్యింది. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు రేవంత్ విమర్శలు, నిలదీత తరువాతైనా కేసీఆర్.. ఫామ్ హౌస్ లో అజ్ణాత వాసానికి చుక్క పెట్టి ప్రజాక్షేత్రంలోకి వస్తారేమో చూడాలి. [Revanth Reddy, KCR Assembly Absence, Telangana Assembly, BRS Leader KCR, Salarie, Telangana Politics, Telugu One]

Published on: Wed Sep 2, 2026 12:08PM

political-news-img

జగన్ లో భయం?.. పులివెందుల జారిపోతోందా?

ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు జగన్ కు పులివెందుల భయం పట్టుకుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికలలో పార్టీ ఓటమి జగన్ రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటను చేస్తారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు. నిజమే.. జగన్ ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలు ఆయనలో భయాన్ని సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన పులివెందుల పర్యటనలు చాలా చాలా అరుదుగానే చేపట్టే వారు. తన తండ్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భాలు కాకుండా ఆయన పులివెందులలో అడుగుపెట్టడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం, పులివెందులలో తన మెజారిటీ గణనీయంగా తగ్గడంతో ఆయన పులివెందుల పర్యటనలు పెరిగాయి. అన్నిటికీ మించి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోయిన తరువాత ఆయనలో పులివెందులపై పట్టు జారిపోతోందన్న భయం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో అప్పటి నుంచి సమయం, సందర్భంతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పులివెందుల వెడుతున్నారు. అక్కడ తన నివాసంలో రెండు మూడు రోజుల ఉంటున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమౌతున్నారు. ప్రజా దర్బార్ తరహాలో వినతులు స్వీకరిస్తున్నారు. నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా ఉండటానికే ఆయన ఇటీవలి కాలంలో తరచూ పులివెందులలో పర్యటిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో వ్యతిరేకత కనిపించడంతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం తగ్గి పెద్దగా పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో జగన్ ముందుజాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. [Pulivendula Fear in Jagan, Jagans Pulivendula visits, YCP Politics, Ap Politics, Telugu One]

Published on: Wed Sep 2, 2026 11:43AM

political-news-img

జనసేనలో బాలినేని పరిస్థితి ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలు నియోజకవర్గం ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. 2024 ఎన్నికల అనంతరం వైసీపీని వీడి జనసేన గూటికి చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ను లక్ష్యంగా చేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో చేసిన విమర్శలు, ఆరోపణలు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య దాదాపు చిచ్చు పెట్టినంత పని చేశాయి. అయితే సకాలంలో తెలుగుదేశం, జనసేన అధినాయకత్వాలు జోక్యం చేసుకుని దామచర్ల, బాలినేనిలను గట్టిగా హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే బాలినేని వ్యాఖ్యలు, విమర్శల పట్ల మాత్రం ఇరు పార్టీలలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వ్యక్తిగత విభేదాలు, పాత తగాదాల లేక్క తేల్చచుకునేందుకు బాలినేని జనసేనను వాడుకుంటున్నారన్న విమర్శలు ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ కూడా వెల్లువెత్తాయి. పరిస్థితిని అర్ధం చేసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో బాలినేనికి స్థానం దక్కలేదు. బాలినేని వంటి సీనియర్ నాయకుడికి స్థానిక ఎన్నికల బాధ్యతల్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని బట్టి జనసేనాని బాలినేనిని దూరం పెట్టారని అవగతమౌతోందంటున్నారు పరిశీలకులు. అలాగే ఒంగోలులో ఎంతో ఘనంగా నిర్వహించిన జనసేన ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజరు కూడా బాలినేనికి జనసేనలో ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోందంటున్నారు. అంతే కాదు.. ఒంగొలులో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజర్ కాలేదనీ, ఆయనను ఆ సమావేశానికి పార్టీ అధిష్ఠానం ఆహ్వానించలేదనీ, అందుకే ఆయన దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో, ఒంగోలులో బాలినేనికి జనసేనలో ప్రాధాన్యత తగ్గిందనీ, పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాలినేని తీరును, పార్టీ కార్యకర్తల, స్థానిక నేతల అభిప్రాయాలనూ, అలాగే మిత్రపక్షమైన తెలుగుదేశం అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. పార్టీలో బాలినేని ప్రభావాన్ని, జోక్యాన్ని తగ్గించారని అంటున్నారు. పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా ఉండాలన్నా, పార్టీ అంతర్గత క్రమశిక్షణ దెబ్బతినకుండా ఉండాలన్నాబాలినేనిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడమే మేలని, జనసేనాని అదే చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూటమి ఐక్యత దెబ్బతినకుండా ఉండటానికీ, అలాగే ప్రకాశం జిల్లాలో జనసైనికులలో కొత్త జోష్ నింపడానికి బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా చర్యలు తీసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Balineni Srinivasa Reddy Imoprtance Diminished, Pawan Kalyan, Janasena Party, Ongole Politics, TDP Janasena Alliance, Telugu One]

Published on: Wed Sep 2, 2026 10:00AM

political-news-img

జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమేనా..?

భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా కొనసాగించడం, రాబోయే రోజుల్లో ఏ విధమైన బిల్లులను ప్రవేశపెడుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖ రాస్తూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, కానీ డీలిమిటేషన్‌ను రాబోయే 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు అంశాలను ముడిపెట్టడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావం చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ నిర్వహించారు. రాజ్యాంగ రీత్యా వ్యూహం రాజకీయ పరిణామాలు ప్రస్తుతం పార్లమెంట్ స్థానాల పెంపునకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటే, అది ఉత్తరాది రాష్ట్రాలకు తీవ్రమైన ప్రయోజనం చేకూరుస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమీకరణాల మార్పు.. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల ద్వారా ఉభయ సభల్లోనూ మెజారిటీ నిరూపించుకునే వ్యూహంతో అడుగులు వేస్తోంది. అయితే, ప్రాంతీయ పార్టీల వైఖరి, ముఖ్యంగా డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ మూడ్ మారడం వంటి పరిణామాలు అధికార పక్షానికి సవాలుగా మారాయి. ప్రతిపక్షాల ప్రతివ్యూహం.. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఒక విభాజక వ్యూహమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తెచ్చి, సీట్ల పెంపు ప్రక్రియను సగానికి సగం విభజించేలా (ఉత్తరాది మరియు దక్షిణాదికి సమంగా) మార్పులు చేయాలని కోరుతోంది. రాజకీయ భయాలు & సంకోచాలు.. రాబోయే ఉత్తర ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై చూపించే ప్రభావం దృష్ట్యా, మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అచితూచి అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీపై వ్యతిరేక స్వారాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా కేంద్రంలో కొత్త భయాలను సృష్టిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ ప్రభావంరాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మారనుంది. జనాభా ఆధారిత విభజన అమలైతే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కబడుతుందనే భావన మరింత బలపడుతుంది. ఇది సమఖ్య వ్యవస్థకే పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది.ఈ రాజకీయ సందిగ్ధత మరింత తీవ్రమైతే, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు డీలిమిటేషన్ ప్రధాన అస్త్రంగా మారుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి ఏకతాటిపైకి వస్తే, కేంద్ర ప్రభుత్వానికి చట్టసభల్లో నిర్ణయాలు తీసుకోవడం సంక్లిష్టంగా మారనుంది. Delimitation Commission, South India Lok Sabha Seats, Women Reservation Bill, Mallikarjun Kharge Letter, Narendra Modi, North vs South Politics, Parliament Seats Expansion, Indian Political Analysis, Delimitation Impact Telugu, Indian Federation Issues, Telugu One, Telugu news

Published on: Tue Sep 1, 2026 8:14PM