సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గానికి రూ. కోటి.!

Publish Date:Sep 8, 2026

Advertisement

రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారానికి, క్షేత్రస్థాయిలో పాలనా వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీ అత్యున్నత నాయకత్వ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.

రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలను సత్వరమే ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించేందుకు వీలుగా  ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా  కోటి రూపాయల చొప్పున ఆర్థిక వనరులు కేటాయిస్తున్నట్లు  వెల్లడించారు.  మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు  జరిగిన లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌లో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. 

ఈ సందర్భంగా బొబ్బిలి శాసనసభ్యుడు బేబినాయన తమ ప్రాంతంలోని మౌలిక వసతులు, ఇతర చిన్న సమస్యల పరిష్కారానికి నిధుల అవసరం ఉందని కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు  వెంటనే ఆ నియోజకవర్గానికి కోటి రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు సభలో ప్రకటించారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించాలనిఆదేశించారు.  కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాకుండా, ఎంపీలు తమ పరిధిలోని ఎంపీలాడ్స్ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. 

ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ఆ నిధులను కేటాయించాలని, ఎంపీలు,  ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ప్రజలతో  మమేకమై పనిచేసే నాయకులకు మాత్రమే సమాజంలో శాశ్వత గుర్తింపు, గౌరవం లభిస్తాయన్నారు.   ప్రజలతోనూ,  పార్టీ కేడర్‌తోనూ ఏర్పడే బలమైన మానసిక బంధమే రాజకీయ విజయాలకు అసలైన పునాది అని చంద్రబాబు ఉద్ఘాటించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న సానుకూల దృక్పథాన్ని రాబోయే ఎన్నికల్లో ఓట్ల రూపంలో మలచుకోవడానికి నేతలు శ్రమించాలని నిర్దేశించారు.  ఈ కాంక్లేవ్ లో స్వర్ణాంధ్ర విజన్ 2047 బృహత్తర ప్రణాళికపై కూడా విస్తృతమైన చర్చ జరిగింది.  ప్రతిపక్షాల నుంచి వస్తున్న నిరాధార ఆరోపణలను, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. 

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే శక్తుల కుట్రలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ, ప్రభుత్వ విధానాలను సమర్థంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు. పార్టీ యంత్రాంగాన్ని మరింత ఉత్సాహపరిచేందుకు ఇలాంటి ఉన్నత స్థాయి లీడర్‌షిప్ సమావేశాలను ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి క్రమం తప్పకుండా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.  ఈ తరహా ప్రత్యేక నిధుల కేటాయింపు మరియు దిశానిర్దేశం వల్ల స్థానిక స్థాయిలో పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న ప్రజా సమస్యలకు వేగంగా మోక్షం లభిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రానున్న కాలంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులను మానసికంగా, వ్యూహాత్మకంగా సన్నద్ధం చేయడంలో ఈ కాంక్లేవ్ అత్యంత కీలకమైన వేదికగా మారుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ అధినాయకత్వం తీసుకుంటున్న ఈ చర్యలు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు మరింత ఊతమిస్తాయని అంచనా వేస్తున్నారు. 

[Rs crore To Every Constituency, CM Chandrababu Naidu, TDP Leadership Conclave, Amaravati News, AP Constituency Funds, Swarna Andhra Vision 2047, Telugu One]

By
en-us Political News

  
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.