రజనీ భయపడ్డాడా..? అందుకే ఆ నిర్ణయమా...!.

Publish Date:Nov 23, 2017

Advertisement

 

గత కొన్ని సంవత్సరాలుగా రజనీకాంత్ రాజకీయ ప్రస్థానంపై ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారో.. పలానా పార్టీలో చేరుతున్నారనో.. అబ్బో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు ఆ వార్తలను ఖండించారు రజనీ. అయితే ఇటీవలే వార్తలను నిజం చేయాలని రజనీ కూడా త్వరలో రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు తన అభిమాన సంఘాలతో ముచ్చటించినప్పుడు కూడా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పాడు. ఇక దీంతో అభిమానులు కూడా అప్పటినుండి ఎప్పుడు రజనీ రాజకీయాల్లో అడుగు పెడతారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ముగించి ఆ తర్వాత పార్టీ గురించి మరోసారి అభిమానులతో చర్చిస్తాను అంటూ రజనీ మళ్లీ వాయిదా వేశారు. అయితే దీని వెనుక మరో స్టోరీ వినిపిస్తోంది.

 

రజినీకాంత్‌ పార్టీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడానికి కారణం మాత్రం కమల్ అని తెలుస్తోంది. ఎందుకంటే.. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న కొన్ని రోజుల్లోనే కమల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నా అని బహిరంగంగానే ప్రకటించాడు. ఇక అప్పటినుండో ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు కమల్. అంతేకాదు.. కమల్‌ మరి కొన్ని రోజుల్లో పార్టీని ప్రకటించడం ఖాయమని... 2019 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో కమల్‌ పార్టీ పోటీకి దిగే అవకాశాలు కూడా ఉందని అంటున్నారు. ఈనేపథ్యంలోనే... కమల్‌, రజినీకాంత్ కు పోటీ పడే అవకాశం ఉందని.. పార్టీ ఏర్పాటుకు ఇంకాస్త సమయం తీసుకోవాలని అందుకే.. పార్టీ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖులు రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని, కమల్‌తో ఢీ కొట్టడం వల్ల లాభం జరగక పోగా నష్టం ఎక్కువ అవుతుందని రజినీకాంత్‌ భావిస్తున్నాడట. అందుకే పార్టీ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో కమల్‌ పార్టీ, కమల్‌ పని తీరును బట్టి రజినీకాంత్‌ రాజకీయ పార్టీ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఒకవేళ కమల్ పార్టీకి ప్రజల ఆదరణ ఎక్కువైతే ఇక రజనీ రాజకీయాల్లోకి రావడం డౌటే అని అంటున్నారు. మరి  కమల్ నాకు పోటీ ఏంటని రజనీ వస్తాడా..? లేక..? వెనుకడుగు వేస్తాడా..?చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో.

By
en-us Political News

  
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.