కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
Publish Date:Apr 7, 2012
Advertisement
ఐపిఎల్ 5 2012: ఐపిఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో శుక్రవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 31 పరుగుల తేడాతో ఘనవిజయం సాదించింది. రాజస్థాన్ ఆటగాడు ఆజింక్య రహానే 66 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 98 పరుగులు సాధించడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించగలిగింది. 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 36 పరుగుల వద్ద ఆ డం గిల్‌క్రిస్ట్ (27) వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత వికె ట్ల పతనం కొనసాగింది. పాల్ వల్తాటీ (13), షాన్ మార్ష్ (7), అభిషేక్ నాయర్ (10) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కొద్దిసేపు పోరాడిన డేవిడ్ హస్సీ 14 పరుగులు చేసి అవుట్ కావడంతో పంజాబ్ విజయావకాశాలు పూర్తిగా చేజారిపోయాయి. బిపుల్ శర్మ 18 పరుగులకు వెనుదిరిగాడు. 123 పరుగులకు ఆరు వికెట్లు చేజారడంతో పంజాబ్ తిరిగి కోలుకునే అవకాశాలు లభించలేదు. 25 బంతుల్లో 34 పరుగులు చేసిన మన్దీప్ సింగ్‌ను అదే ఓవర్‌లో అంకీత్ చవాన్ అవుట్ చేశాడు. పీయూష్ చావ్లా 10 పరుగులకే పరిమితంకాగా, ప్రవీణ్ కుమార్ 10 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులు చేసింది. అప్పటికి హర్మీత్ సింగ్ 1, ఫాల్క్‌నెర్ 11 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. రాజస్థాన్‌కు 31 పరుగుల తేడాతో విజయం లభించింది.
http://www.teluguone.com/news/content/rajasthan-royals--kings-xi-punjab-24-13221.html





