కూతురిని ప్రేమించాలని వేధింపులు.. మందలించిన తండ్రిని కత్తితో పొడిచి హత్య..!

Publish Date:Sep 17, 2026

Advertisement

మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తెను ప్రేమించాలని వేధిస్తున్న యువకుడిని మందలించినందుకు ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. మాదన్నపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాగ్-ఎ-జహారా, యాకుత్‌పురాకు చెందిన హస్మత్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆయన రెండో కుమార్తె హమ్రీన్‌ను ప్రేమించాలని హబీబ్ మహమ్మద్ (27) కొంతకాలంగా వెంటపడుతూ వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై హస్మత్ పలుమార్లు మహమ్మద్‌ను మందలించారు. దీంతో హస్మత్‌పై కక్ష పెంచుకున్న మహమ్మద్.. ఆయన కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు.

చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖేర్ తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేసిన మహమ్మద్ ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. హమ్రీన్‌ను ప్రేమించాలని వేధిస్తున్న అతడిని ఆమె తండ్రి మందలించడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో హస్మత్ ఇంట్లోకి చొరబడిన మహమ్మద్.. హమ్రీన్‌పై దాడికి యత్నించాడు. దీంతో హస్మత్ అడ్డుకోవడంతో.. నిందితుడు కత్తితో ఆయనపై దాడి చేశాడు. ఈ దాడిలో హస్మత్ తీవ్రంగా గాయపడ్డారు. తండ్రిని రక్షించేందుకు ప్రయత్నించిన కుమారుడు ఉమర్‌పైనా మహమ్మద్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన తండ్రి, కుమారుడిని పోలీసులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హస్మత్ మృతి చెందారు. ఉమర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు.

నిందితుడి దాడి నుంచి తప్పించుకున్న హమ్రీన్ అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు హబీబ్ మహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన స్థలానికి క్లూస్ టీమ్ చేరుకుని ఆధారాలను సేకరించింది. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులు, నిందితుడి కదలికలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన విషయం తెలుసుకున్న మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఒకవైపు ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేయడం.. మరోవైపు తన కుమార్తెను కాపాడేందుకు అడ్డొచ్చిన తండ్రిపై కత్తితో దాడి చేయడం.. చివరకు ఈ ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మాదన్నపేటలో జరిగిన ఈ ఘటన పాతబస్తీలో సంచలనం సృష్టించింది.

 

 

[ Madannapet Murder, Hyderabad Crime,Old City Crime, Love Harassment, Father Murder, Knife Attack,Habib Mohammed, Hasmath Murder, Umar Injured, Madannapet Crime, Hyderabad Police,Charminar Zone, Old Hyderabad Crime ]


 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.